మహేష్ బాబుకి తల్లిగా రేణూ దేశాయ్...

Webdunia
శుక్రవారం, 1 మే 2020 (19:51 IST)
పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణూ దేశాయ్ సెకండ్ ఇన్సింగ్సుకి రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ... స్టార్ హీరోలైన ప్రభాస్, మహేష్ బాబులకు తల్లి పాత్రల్లో కనిపించడానికి తనకెలాంటి అభ్యంతరం లేదని వెల్లడించారు. అయితే అది మహేష్, ప్రభాస్ చిన్నప్పుడు తల్లిగా నటించేందుకు సిద్ధమనీ, వారు పెద్దయ్యాక తనను వృద్ధ పాత్రలో హుందాగా కనిపించేట్లు చేస్తారని తను విశ్వసిస్తున్నట్లు చెప్పారట. దీన్నిబట్టి ఇకపై రేణూ దేశాయ్ టాలీవుడ్ సినిమాల్లో వరుసగా నటించేస్తారన్నమాట.
 
ఇదిలావుంటే సూపర్ స్టార్ మహేష్‌ బాబు సరిలేరు నీకెవ్వరు సినిమాతో సంచలన విజయం సాధించడం... సరికొత్త రికార్డు క్రియేట్ చేయడం తెలిసిందే. చాలా ఏరియాల్లో నాన్ బాహుబలి రికార్డ్ సొంతం చేసుకుంది. ఈ సినిమా తర్వాత వంశీ పైడిపల్లితో సినిమా చేయాలనుకున్నారు కానీ.. సెట్స్ పైకి వెళ్లకుండానే ఆగిపోయింది. ఆ తర్వాత మహేష్‌ ఎవరితో సినిమా చేస్తాడా..? అనుకుంటే.. కొంత మంది దర్శకుల పేర్లు ప్రచారంలోకి వచ్చినా.. ఆఖరికి పరశురామ్‌తో మూవీ కన్ఫర్మ్ అయ్యింది.
 
 
 
మహేష్‌ - పరశురామ్ మూవీ త్వరలో సెట్స్ పైకి వెళుతుంది అనుకుంటే.. కరోనా వచ్చింది. దీంతో అన్ని సినిమాలు ఆగిపోవడం తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించి ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుంది. ఇదిలా ఉంటే... ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా ఈ సినిమాలో మార్పులు చేర్పులు చేస్తున్నారని వార్తలు వస్తున్నాయి. ఇంతకీ ఏంటా మార్పులు చేర్పులు అంటే...  ఈ చిత్రంలో చాల భాగం యుఎస్ బ్యాక్‌ డ్రాప్‌లో చిత్రీకరించాల్సి ఉందట. దాంతో కచ్చితంగా ఈ చిత్రంలో ఎక్కువ భాగం అమెరికాలో షూట్‌ జరగాల్సి ఉంది కానీ... ప్రస్తుతం ఉన్న పరిస్థితుల వలన అమెరికాలో షూట్ చేయడం చాలా కష్టం.
 
 దాంతో స్క్రిప్ట్ నే మారుస్తున్నట్లు తెలిసింది. 
 
ఇప్పటికే స్క్రిప్ట్ లో చాల మార్పులు చేశారని టాక్. ఈ సినిమా గురించి పరశురామ్ స్పందిస్తూ.. ఒక్కడు సినిమా చూసి ఇండస్ట్రీకి వచ్చాను. మహేష్‌ బాబుతో సినిమా చేయాలనేది డ్రీమ్. నా కల నెరవేరబోతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. అభిమానులకు పండగ అనేలా ఈ సినిమా ఉంటుందని చెప్పారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఎక్కడో తప్పు జరిగింది... కమిటీలన్నీ రద్దు చేస్తున్నా : ప్రశాంత్ కిషోర్

బిడ్డల కళ్లెందుటే కన్నతల్లి మృతి.. ఎలా? ఎక్కడ? (వీడియో)

యుద్ధంలో భారత్‌ను ఓడించలేని పాకిస్తాన్ ఉగ్రదాడులకు కుట్ర : దేవేంద్ర ఫడ్నవిస్

మెట్రో రైల్ ఆలస్యమైనా ప్రయాణికులపై చార్జీల బాదుడు... ఎక్కడ?

హెటెన్షన్ విద్యుత్ వైరు తగలడంతో క్షణాల్లో దగ్ధమైపోయిన బస్సు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కూరల్లో వేసుకునే కరివేపాకును అలా తీసిపడేయకండి, ఎందుకంటే?

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తర్వాతి కథనం
Show comments