Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రభాస్‌ను ఎప్పటి నుండో అడుగుతున్నా.. ఇప్పటికైనా వచ్చాడే..!: తమన్నా

Webdunia
మంగళవారం, 16 ఏప్రియల్ 2019 (19:01 IST)
ఇదేదో సినిమా అవకాశాలో, ఇంకోటో కాదండీ... విషయానికి వస్తే... ప్రభాస్ ఇటీవల ఇన్‌స్టాగ్రామ్‌లో ఖాతా తెరిచిన నేపథ్యంలో మిల్కీ బ్యూటీ తమన్నా పైవిధంగా స్పందించింది. వివరాలలోకి వెళ్తే... ఇటీవల ప్రభాస్ సోషల్ మీడియా ఇన్‌స్టాగ్రామ్‌లో ఖాతా తెరిచిన విషయం తెలిసిందే. 


ఇందులో ప్రభాస్ ఇప్పటి వరకైతే ఒక్క పోస్ట్ కూడా చేయలేదు కానీ, త్వరలోనే ‘సాహో’ సినిమాకు సంబంధించిన అప్‌డేట్స్‌ను పోస్ట్ చేస్తారని ఆయన అభిమానులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. 
 
కాగా... ఆయన తన ఖాతాలో కనీసం ఫోటో కానీ, ఎలాంటి పోస్ట్ కానీ పెట్టకముందే, ఆయన పేరును మాత్రమే చూసి దాదాపు 7 లక్షల మందికి పైగా ఫాలో అవుతున్నారంటే ప్రేక్షకులు ఆయన అప్‌డేట్స్ కోసం ఎంతగా ఎదురుచూస్తున్నారో చెప్పేయవచ్చు.
 
ఈ నేపథ్యంలో... ప్రభాస్ ఇన్‌స్టాగ్రామ్ ఖాతాని ప్రారంభించడంపై తాజాగా తమన్నా స్పందించింది. ప్రభాస్‌ను ఇన్‌స్టాగ్రామ్‌లోకి రమ్మని తాను చాలా రోజులుగా అడుగుతున్నట్టు తెలిపిన తమన్నా... ఇప్పటికైనా వచ్చారనీ, తనకు చాలా సంతోషంగా ఉందనీ తెలిపింది. ప్రత్యేకించి ప్రభాస్ అభిమానులు చాలా సంతోషిస్తారని ఈ సందర్భంగా తమన్నా పేర్కొంది. మరి... ఆయన అప్‌డేట్‌లు ఎప్పుడు మొదలెడతాడో చూద్దాం...

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

నడిరోడ్డుపైనే ప్రసవం - బ్యాంకాక్‌లో దయనీయ పరిస్థితులు

చెరువులో నాలుగు మృతదేహాలు : భర్తే యేసునే హంతకుడా?

ఒరిస్సాలో కామాఖ్య ఎక్స్‌ప్రెస్ రైలు ప్రమాదం ... పట్టాలు తప్పిన ఏసీ బోగీలు

నాగలిపట్టిన ఎంపీ కలిశెట్టి - ఉగాది రోజున ఏరువాక సేద్యం...

ఫిరంగిపురంలో దారుణం... బాలుడిని గోడకేసి కొట్టి చంపిన సవతితల్లి!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

తర్వాతి కథనం
Show comments