Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాహుబలి-2లో అన్ని ప్రశ్నలకు సమాధానం: రాజమౌళి

శక్తివంతమైన పాత్రల మధ్య అత్యంత తీవ్రంగా జరిగిన సంఘర్షణే బాహుబలి-2గా రూపొందినట్లు చిత్ర దర్శకుడు రాజమౌళి చెప్పారు. బాహుబలి ది కన్‌క్లూజన్ చిత్ర ప్రమోషన్‌లో భాగంగా ఆదివారం చెన్నైలో నిర్వహించిన మీడియా సమావేశంలో బాహుబలి చిత్రం బృందం పాల్గొన్న సందర్భంగా ర

Webdunia
సోమవారం, 10 ఏప్రియల్ 2017 (01:58 IST)
శక్తివంతమైన పాత్రల మధ్య అత్యంత తీవ్రంగా జరిగిన సంఘర్షణే బాహుబలి-2గా రూపొందినట్లు చిత్ర దర్శకుడు రాజమౌళి చెప్పారు. బాహుబలి ది కన్‌క్లూజన్ చిత్ర ప్రమోషన్‌లో భాగంగా ఆదివారం చెన్నైలో నిర్వహించిన మీడియా సమావేశంలో బాహుబలి చిత్రం బృందం పాల్గొన్న సందర్భంగా రాజమౌళి రెండోభాగం విశేషాలను పంచుకున్నారు.  బాహబలి చిత్రం తీయాలని నిర్ణయించుకున్నప్పుడే దాన్ని బహుభాషా చిత్రంగా తీయాలని అనుకున్నాం. దాంట్లో భాగంగా తమిళంలో తీయాలనుకున్నప్పుడు, తమిళ మాతృకను కోల్పోకుండా నాజర్‌, సత్యరాజ్‌ తదితరులతో ప్రతీ విషయాన్ని చర్చించి ఈ చిత్రాన్ని నిర్మించాం. తమిళ ప్రేక్షకులకు మాతృభాషలోని మాధుర్యం అందేలా, ప్రతీ దృశ్యం, పాత్ర బాగా రావడానికి చిత్రబృందం విశేష కృషి చేసిందంటూ రాజమౌళి అందరికీ కృతజ్ఞతలు తెలిపారు.
 
బాహుబలి వెయ్యి సంవత్సరాల కిందట జరిగినట్లు చూపే వూహాజనితమైన కథ కాబట్టే అందులో అప్పటి వేషధారణ, సామాజిక స్థితిగతులను ప్రతిబింబించేలా పాత్రలను రూపకల్పన చేశామన్నారు. సినిమాలోని యుద్ధ సన్నివేశాల్లో అప్పట్లో ఎలాంటి ఆయుధాలు ఉపయోగించారో వూహించి వాటినే చూపించాం. బాహుబలి కథ అంతా ఒకటే. కానీ నిడివి ఎక్కువగా ఉండటంతోనే రెండు భాగాలుగా తీశాం. మహాభారతం తీయాలని ఎప్పటినుంచో ఉంది. ఆ సమయం వచ్చినప్పుడు చెబుతానన్నారు.
 
రెండో భాగంలో పాత్రల మధ్య సంఘర్షణను కనపడుతుంది. అలాగే మొదటి భాగం చూసిన ప్రేక్షకులకు తలెత్తిన అన్ని సందేహాలకు ‘బాహుబలి-2’లో సమాధానం దొరుకుతుంది. బాహుబలి చిత్రంలోని ప్రతీ పాత్ర ప్రజల్లోకి చొచ్చుకుని పోయింది. ఆ పాత్రలను కూలంకషంగా వివరించేందుకు టీవీ సీరీస్‌, యానిమేషన్స్‌, ఇతర రూపకాల్లో కొనసాగిస్తాం. మొదటి భాగంలో కనిపించిన పాత్రల మధ్య నడిచే అసలైన డ్రామాను ‘బాహుబలి ది కన్‌క్లూజన్‌’లో చూడవచ్చని అన్నారు 
 
సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌తో కూడా ఏదో ఒకరోజు సినిమా తీస్తా. ప్రస్తుతం నా మదిలో బాహుబలి తప్ప వేరే ఆలోచన ఏదీ లేదు’ అని రాజమౌళి పేర్కొన్నారు. చెన్నయ్‌లో జరిగిన చిత్ర ప్రమోషన్ సందర్భంగా బాహుబలి టీమ్‌కి తమిళ మీడియా బ్రహ్మరథం పట్టింది.
 
అన్నీ చూడండి

తాజా వార్తలు

Lorry: లారీ వెనక్కి వచ్చింది.. లేడీ బైకరుకు ఏమైందంటే? (video)

UP: డబుల్ డెక్కర్‌ బస్సులో అగ్ని ప్రమాదం.. ఐదుగురు సజీవదహనం (video)

Donald Trump: నాకు టిమ్ కుక్‌తో చిన్న సమస్య ఉంది.. డొనాల్డ్ ట్రంప్

వైకాపాకు షాక్... మైదుకూరు మున్సిపల్ చైర్మన్ చంద్ర రాజీనామా

Baba Singh: యూపీ బీజేపీ నేత బాబా సింగ్ రఘువంశీ పబ్లిక్ రాసలీలలు (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బరువు తగ్గడం కోసం 5 ఆరోగ్యకరమైన స్నాక్స్, ఏంటవి?

పైల్స్ తగ్గేందుకు సింపుల్ టిప్స్

పసుపు, మిరియాల పొడిని కలిపిన గోల్డెన్ మిల్క్ తాగితే?

రోజూ ఒక చెంచా తేనె సేవిస్తే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments