Webdunia - Bharat's app for daily news and videos

Install App

మన్నార్ చోప్రా డ్యాన్స్ అయిపోగానే అడ్డుకున్నారు.. ఎందుకో తెలుసా?

టి సుబ్బరామిరెడ్డి కల్చరల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో టీఎస్సార్ నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్ 2015-16 కార్యక్రమం శనివారం రాత్రి విశాఖలో జరిగింది. పోర్టు స్టేడియంలో జరిగిన ఈ వేడుకలను కళాబంధు టీ సుబ్బిరామిరెడ్డి నిర

Webdunia
ఆదివారం, 9 ఏప్రియల్ 2017 (15:21 IST)
టి సుబ్బరామిరెడ్డి కల్చరల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో టీఎస్సార్ నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్ 2015-16 కార్యక్రమం శనివారం రాత్రి విశాఖలో జరిగింది. పోర్టు స్టేడియంలో జరిగిన ఈ వేడుకలను కళాబంధు టీ సుబ్బిరామిరెడ్డి నిర్వహించారు. అయితే, ఈ అవార్డుల కార్యక్రమాన్ని పోలీసులు అడ్డుకున్నారు. 
 
అవార్డుల ప్రధానోత్సవం తర్వాత ప్రియాంక చోప్రా కజిన్ మన్నారా చోప్రా పెర్ఫార్మెన్స్ సాగుతోంది. ఇది పూర్తికాగానే, ఓ పోలీసు అధికారి స్టేజ్‌పైకి వచ్చి మైక్ అందుకుని ‘‘క్షమించాలండి. ఇక్కడ పది గంటల వరకే అనుమతిఇచ్చాం. ఇప్పుడు 10:40 అయ్యింది. కాబట్టి ఈ కార్యక్రమాన్ని ఆపేస్తున్నాం’’ అని అనౌన్స్ చేశారు. 
 
అయితే మన్నారా చోప్రా పెర్ఫార్మెన్స్ అనంతరం ఓ హిందీ సాంగ్‌కు మరో పెర్ఫార్మెన్స్ ఉండడంతో ‘‘చెయ్‌వయ్యా నువ్వు.. చెయ్ చెయ్.. కమాన్ డూ ఇట్.. కమాన్ స్టార్ట్.. స్టార్ట్’’ అంటూ కంటెస్టెంట్స్‌ను కంటిన్యూ చేయమని సుబ్బిరామిరెడ్డి ఆదేశించారు. 
 
అయినా పోలీసులు అనుమతించలేదు. దీంతో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. దీన్ని గమనించిన టీఎస్ఆర్... మైక్ అందుకుని ‘‘ఈ రోజు ఈ కార్యక్రమం సక్సెస్ కావడానికి కారణం పోలీస్ డిపార్ట్‌మెంటే’’ అని ప్రకటించడంతో వివాదం సద్దుమణిగి కార్యక్రమాన్ని అంతటితో ముగించారు. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

PM Modi: విశాఖపట్నంలో అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు.. ప్రధాని హాజరు

చైనా ఆయుధ వ్యవస్థలను ఏమార్చి పాక్‍లో లక్ష్యాలపై దాడులు చేసిన భారత్!!

బీజాపూర్ జిల్లాలో భారీ ఎన్‌కౌంటర్ - 31 మంది మావోలు హతం

Hyderabad: హాస్టల్ గదిలో ఉరేసుకున్న డిగ్రీ విద్యార్థి.. కారణం ఏంటో?

కాళ్ళబేరానికి వచ్చిన పాకిస్థాన్ : సింధు జలాల రద్దు పునఃసమీక్షించండంటూ విజ్ఞప్తి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పైల్స్ తగ్గేందుకు సింపుల్ టిప్స్

పసుపు, మిరియాల పొడిని కలిపిన గోల్డెన్ మిల్క్ తాగితే?

రోజూ ఒక చెంచా తేనె సేవిస్తే ఏమవుతుంది?

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments