Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాహుబలి-2కి ఎండదెబ్బ.. సెలవులిచ్చేసిన జక్కన్న.. చిన్న సీన్స్ చేసుకుంటూ?!

Webdunia
శుక్రవారం, 29 ఏప్రియల్ 2016 (15:15 IST)
ప్రపంచ ప్రేక్షకులను టాలీవుడ్‌ వైపు తిరిగి చూసేలా చేసిన బాహుబలి సినిమా పార్ట్ 2 కోసం జక్కన్న షూటింగ్ పనుల్లో బిజీ బిజీగా ఉన్నాడు. బాహుబలి 2ను అంచనాలకు మించి తెరకెక్కించాలని దర్శకుడు రాజమౌళి తన బృందంతో కలిసి తీవ్రంగా శ్రమిస్తున్నాడు. ఈ క్రమంలో బాహుబలి-2లో కొన్ని సర్‌ప్రైజ్‌లు తప్పకుండా ఉంటాయని తెలుస్తోంది. ఇప్పటికే బాహుబలి2కి సంబంధించి రకరకాల వార్తలు షికారు చేస్తుంటే.. తాజాగా బాహుబలి సినిమా షూటింగ్‌కు సెలవు ప్రకటించినట్లు సినీ జనం అంటున్నారు. 
 
బాహుబలి 2లో ప్రత్యేకించి నటీనటులుండరని, ఉన్నవారితోనే బాహుబలి-2 కూడా అయిపోతుందని కొందరంటే.. అదంతా ఉత్తుత్తిదేనని మరికొందరు అంటున్నారు. కానీ కొత్త నటుల్ని బాహుబలి స్క్రీన్‌పైకి ప్రవేశించేలా చేయాలని రాజమౌళి ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో బాహుబలి-2కు సంబంధించిన పనులు నత్తనడకన నడుస్తున్నాయి. ఎండలు మండిపోవడంతో బాహుబలి నటీనటుల్లో చాలామందికి సెలవిచ్చేశాడు జక్కన్న. దీంతో కొంతమంది నటీనటులతో చిన్న చిన్న సీన్స్ తీసుకుంటున్నాడు. ఎండలు తగ్గిన తర్వాత జూన్‌లో మళ్లీ సినిమా షూటింగ్‌ ప్రారంభం కానుందని బాహుబలి నిర్మాత ట్విట్టర్లో తెలిపారు. 
 
ఇప్పటికే హాలీవుడ్ స్టంట్ మాస్టర్ లీ వైట్టేకర్‌ సారథ్యంలో కొన్ని యాక్షన్స్ సీన్స్‌ను షూట్ చేసినట్లు తెలుస్తోంది. అయితే భానుడి వేడి అధికం కావడంతో బాహుబలి టీమ్‌కు సెలవు ప్రకటించినట్లు తెలుస్తోంది. కాగా వచ్చే సమ్మర్‌కు కానుకగా అంటే ఏప్రిల్ 14, 2017న బాహుబలి : ది కన్‌క్లూజన్ రిలీజ్ కానుంది.

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments