Webdunia - Bharat's app for daily news and videos

Install App

'బ్యాక్ స్టేజ్ బ్రోమాన్స్‌'గా ఎన్టీఆర్ - చెర్రీ

Webdunia
ఆదివారం, 19 డిశెంబరు 2021 (14:29 IST)
దర్శకుడు ధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి తెరకెక్కించిన చిత్రం "ఆర్ఆర్ఆర్". జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్‌లు హీరోలుగా నటించారు. బాలీవుడ్ హీరోయిన్లుగా అలియా భట్, ఒలివియా మోరిస్‌లు నటించగా, బాలీవుడ్ నటుడు అజయ్ దేవగన్ కీలక పాత్రను పోషించారు. ఈ చిత్రం ప్రీరిలీజ్ ఈవెంట్ ఆదివారం రాత్రి భారీ స్థాయిలో ముంబైలో నిర్వహించనున్నారు. ఈ ఏర్పాట్లను పర్యవేక్షించేందుకు ఈ చిత్రం బృందం మొత్తం ఇప్పటికే ముంబైకు చేరుకుంది. 
 
ఈ బృందం ముంబై విమానాశ్రయంలో దిగినప్పటి నుంచి ఇప్పటివరకు "ఆర్ఆర్ఆర్" టీమ్‌కు చెందిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తాజాగా హీరోలు ఎన్టీఆర్, చెర్రీలకు సంబంధించిన ఆసక్తికర ఫోటోలు బ్యాక్ స్టేజ్ బ్రొమాన్స్ అంటూ సోషల్ మీడియాలో చిత్ర బృందం షేర్ చేశారు. ఈ ఇద్దరు స్టార్లు పిచ్చాపాటి ముచ్చట్లలో మునిగిపోయారు. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 
 
"బ్యాక్ స్టేజ్ బ్రోమాన్స్.. #RoarofRRRinMumbai కోసం సిద్ధమవుతోంది" అంటూ టీం ఈ ఫోటోను ట్విట్టర్‌లో షేర్ చేశారు. ఇందులో ఎన్టీఆర్ బ్లూ రౌండ్ నెక్ టీ షర్ట్, జీన్స్, క్యాప్ ధరించివుండగా, చెర్రీ మాత్రం తెల్లటి రౌండ్ నెక్ టీ షర్ట్, కార్గో జీన్స్ ధరించాడు. ఈ చిత్రం వచ్చే యేడాది జనవరి 7వ తేదీన ప్రపచం వ్యాప్తంగా ఐదు భాషల్లో విడుదలకానుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

KTR: కేటీఆర్‌‌కు ఓ స్వీట్ న్యూస్ ఓ హాట్ న్యూస్.. ఏంటది?

గంటలో శ్రీవారి దర్శనం.. ఎలా? వారం రోజుల పాటు పైలెట్ ప్రాజెక్టు!

బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం... ఉత్తారంధ్రకు భారీ వర్ష సూచన!

మీసాలు తిప్పితే రోడ్లు పడవు : మీ కోసం పని చేయనివ్వండి .. పవన్ కళ్యాణ్

హనీమూన్‌కు ఎక్కడికి వెళ్లాలి.. అల్లుడుతో గొడవు.. మామ యాసిడ్ దాడి!!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ప్రతిష్టాత్మక IIT మద్రాస్ CSR అవార్డు 2024 గెలుచుకున్న హెర్బాలైఫ్ ఇండియా

పొడియాట్రిక్ పాదాలు-చీలమండ చికిత్సను మెరుగుపరచడానికి ఇసావోట్ అత్యాధునిక ఓ-స్కాన్ ఎంఆర్ఐ మెషీన్‌

చేదుగా వుండే కాకరకాయ ఆరోగ్యానికి అద్భుతమైన మేలు

ఉదయం పూట ఖాళీ కడుపుతో తీసుకోదగిన ఆహారం, ఏంటి?

భారతదేశంలో పెరుగుతున్న ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ కేసులు: ముందస్తుగా గుర్తించడం ఎందుకు కీలకం

తర్వాతి కథనం
Show comments