Webdunia - Bharat's app for daily news and videos

Install App

సైకలాజికల్ థ్రిల్లర్ నేప‌థ్యంలో శ్ర‌ధ్దాదాస్ అర్థం

Webdunia
మంగళవారం, 19 అక్టోబరు 2021 (18:33 IST)
Shraddhadas
'దేవి', 'పెదరాయుడు' చిత్రాలతో బాలనటుడిగా గుర్తింపు తెచ్చుకున్న మహేంద్ర, శ్రద్ధా దాస్, అజయ్, ఆమని, సాహితీ అవంచ ప్రధాన తారలుగా రూపొందుతున్న సైకలాజికల్ థ్రిల్లర్ 'అర్థం'. రిత్విక్ వెత్సా సమర్పణలో మినర్వా పిక్చర్స్, ఎస్‌విఎమ్ (శ్రీ వాసవి మూవీ) ప్రొడక్షన్స్ పతాకాలపై రాధికా శ్రీనివాస్ నిర్మిస్తున్నారు. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో సినిమా తెరకెక్కింది. ఇంతకు ముందు అనేక చిత్రాలకు ఎడిటర్‌గా, వీఎఫ్ఎక్స్ నిపుణుడిగా పని చేసి గుర్తింపు తెచ్చుకున్న మణికాంత్ తెల్లగూటి రచయిత, దర్శకుడు.
 
ఈ సినిమా ఫస్ట్‌లుక్ మోషన్ పోస్టర్ విడుదల చేసిన ప్రముఖ దర్శకుడు దేవ్ కట్టా, చిత్రబృందానికి శుభాకాంక్షలు తెలియజేశారు. సినిమా విజయవంతకం కావాలని ఆకాంక్షించారు. మోషన్ పోస్టర్ లో విజువల్ ఎఫెక్ట్స్ హై స్టాండర్డ్స్ లో ఉన్నాయని నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. మోషన్ పోస్టర్ చివరలో గన్ పట్టుకుని కనిపించిన మహేంద్ర సినిమాపై క్యూరియాసిటి పెంచారు. శ్రద్ధా దాస్ కూడా కనిపించారు.
 
నిర్మాత రాధికా శ్రీనివాస్ మాట్లాడుతూ,  ప్రేక్షకులను ఉత్కంఠకు గురిచేసే కథాంశంతో రూపొందుతున్న సైకలాజికల్ థ్రిల్లర్ చిత్రమిది. చిత్రీకరణ పూర్తయింది. త్వరలో విడుదల వివరాలు వెల్లడిస్తాం. మణికాంత్ తెల్లగూటి అద్భుతంగా తెరకెక్కించారు. తెలుగులో 'ఖైదీ'కి అద్భుతమైన మాటలు, పలు చిత్రాల్లో పాటలు రాసిన రాకేందు మౌళి మా సినిమాకి మాటలు, పాటలు రాశారు. హర్షవర్ధన్ రామేశ్వర్ చక్కటి బాణీలు అందించారు. త్వరలో విడుదల తేదీ వెల్లడిస్తామం" అని అన్నారు.
 
దర్శకుడు మణికాంత్ తెల్లగూటి మాట్లాడుతూ "కుటుంబ విలువలను కాపాడే, మహిళా సాధికారతను పెంపొందించే సరికొత్త కథాంశంతో రూపొందుతున్న సినిమా - 'అర్థం'. సైకలాజికల్ థ్రిల్లర్ సినిమాకి వినోదం మేళవించి ఆసక్తికరంగా తీర్చిదిద్దుతున్నాం. వీఎఫ్ఎక్స్‌లో నాకు అనుభవం ఉండటంతో సినిమా వీఎఫ్ఎక్స్‌ విషయంలో మరింత శ్రద్ధ వహిస్తున్నాను. అత్యుత్తమ నిర్మాణ విలువలతో రాధికా శ్రీనివాస్ గారు సినిమా నిర్మించారు" అని అన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Deputy CM ట్రెండ్, 10 వేల మంది జీవితాలు పోతాయ్ అంటారా? సీజ్ ది షిప్ అంటూ పవన్ కల్యాణ్

రోడ్డుపై వెళ్తున్న వ్యక్తిపై గాడిద దాడి.. కాలికి తీవ్రగాయం వీడియో వైరల్

నైరుతి బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం... ఆ రెండు పోర్టులకు ప్రమాద హెచ్చరికలు

పోర్టులోకి రైస్ ఎలా వస్తుంది? డిప్యూటీ సీఎం అయిన నాకే సహకారం లేదు: పవన్ విస్మయం (video)

వైనాట్ 175 అన్నారు.. చివరకు 11 వచ్చాయి.. అయినా మార్పు రాలేదు : జగన్‌పై బాలినేని ఫైర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Mint Juice, శీతాకాలంలో పుదీనా రసం తాగితే?

లెమన్ టీ తాగుతున్నారా? ఐతే వీటిని తినకండి

లవంగం పాలు ఆరోగ్య ప్రయోజనాలు

చియా విత్తనాలు అద్భుత ప్రయోజనాలు

Winter Fruit కమలా పండ్లును తింటే ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments