Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఇద్దరు పసిపిల్లలను ఉరివేసి... రాజ‌మండ్రిలో కసాయి తల్లి ఘాతుకం

Advertiesment
ఇద్దరు పసిపిల్లలను ఉరివేసి... రాజ‌మండ్రిలో కసాయి తల్లి ఘాతుకం
విజ‌య‌వాడ‌ , సోమవారం, 11 అక్టోబరు 2021 (10:32 IST)
ఓ క‌సాయి త‌ల్లి త‌న ఇద్దరు పిల్ల‌ల‌కు ఉరివేసి చంపేసింది. ఈ ఘటన రాజమహేంద్రవరం ఆనంద నగర్ లో ఆదివారం రాత్రి చోటు చేసుకుంది. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి ఆనంద్ నగర్ లో ఈ దారుణం జ‌రిగింది. తన ఇద్దరు  పిల్లలనూ  పూరేటి లక్ష్మీ అనూష (28) ఊరివేసి చంపింది. అనూష త‌న కుమార్తె చిన్మయి (8) , కుమారుడు మోహిత్ శ్రీ సత్య సాయి (6)లను ఆదివారం రాత్రి ఇంట్లో ఉరివేసి హత్య చేసింది. బ్యూటీషియన్ గా పనిచేస్తూ, ఓ వ్యక్తితో సహజీవనం చేస్తోంది లక్ష్మీ అనూష. 13 ఏళ్ల  క్రితం ఆమెకు తాడేపల్లికి చెందిన రామ్ లక్ష్మణతో వివాహం అయింది. భర్త ఐదేళ్ల క్రితం ఆత్మహత్య చేసుకున్నాడు. 
 
అప్పటి నుండి రాజమండ్రి వచ్చి బ్యూటీషియన్ గా పనిచేస్తూ, ఒకవైపు వడ్డీ వ్యాపారాలు నడుపుతోంది అనూష‌. ఏడాది క్రితం రామచంద్రాపురంకి చెందిన జొన్నలగడ్డ రామకృష్ణతో మ‌రో వివాహం అయ్యింది. రామకృష్ణ పోలవరంలో నివాసం ఉంటున్నాడు. గత కొద్ది కాలంగా సీతంపేటకు చెందిన సతీష్ అనే వ్యక్తి తో సహజీవనం కొనసాగిస్తోంది. తరుచు పిల్లలను హింస లకు గురి చేస్తుండటంతో, పిల్లల్ని కొట్టద్దని అడొచ్చిన తల్లి ముత్యం కనకదుర్గను గాయపర్చి గూడు విడగొట్టింది. దాంతో తల్లి ఆసుపత్రిలో చికిత్స పొందుతొంది. ఈ ఘటనపై లక్ష్మి అనూష సోదరులు వారి మేనమామకు సమాచారం అందించడంతో, వారు లక్ష్మీని ఫోన్ చేసి మందలించారు. దానితో కోపంతో ఇద్దరు పిల్లలను ఆదివారం రాత్రి ఇంట్లో ఉరి వేసి హత్య చేసి అనంతరం ఉరితాడు చాకుతో కోసి పిల్లలు మంచం మీద పడుకోబెట్టి ఆమె ప్రియుడు సతీష్, సోదరులకు ఈ ఘాతుకానికి పాల్పడినట్లు ఫోన్ చేసింది. 
 
వారు ఆగమేఘాలపై ఘటనా స్థలానికి చేరుకునే సరికి, ల‌క్ష్మి ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య యత్నానికి పాల్పడుతుండగా వారు నిరోధించారు. అనంతరం చనిపోయిన పిల్లల్ని అనుష్కను 108 వాహనంలో రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా పిల్లలు మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు.  సమాచారం తెలిసిన త్రీటౌన్ సీఐ మధుబాబు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. కసాయి తల్లి ల‌క్ష్మిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. ఈ ఘతకానికి పాల్పడిన కసాయి తల్లి లక్ష్మి అనూషను కఠినంగా శిక్షించాలని ఆమె తల్లి ముత్యం కనకదుర్గ డిమాండ్ చేస్తోంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అస్సాం ముఖ్యమంత్రి హిమంత హత్యకు కుట్ర - ఓ వ్యక్తి అరెస్టు