ఓ మహిళ అతి కిరాతకంగా ప్రవర్తించింది. పేగు తెంచుకుని జన్మించిన ఇద్దరు పిల్లలను హత్య చేసింది. అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్నారనీ హతమార్చింది. ఈ దారుణం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని రాజమండ్రిలో వెలుగులోకి వచ్చింది.
ఆనంద్ నగర్‌లో బ్యుటీషియన్‌గా పనిచేస్తున్న లక్ష్మీ అనూషకు కూతురు చిన్మయి, కుమారుడు మోహిత్ అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. 13 యేళ్ల క్రితం భర్త చనిపోవడంతో తాడేపల్లి నుంచి రాజమండ్రి వచ్చి జీవనం సాగిస్తున్నది. ఈ క్రమంలో గత కొంతకాలంగా ఓ వ్యక్తితో సహజీవనం చేస్తున్నది.
అయితే తరచూ పిల్లలను కొడుతుండటంతో అనూష తల్లి కనకదుర్గ.. ఆమెను మందలించింది. దీంతో కనకదుర్గను అనూష గాయపర్చింది. కాగా, ఆదివారం రాత్రి తన పిల్లకు ఉరివేసి చంపేసింది. అనంతరం ప్రియుడికి ఫోన్ చేసి విషయం చెప్పింది.
కాగా, స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో ఘటనా స్థలానికి చేరుకున్నది. చిన్నారుల మృతదేహాను స్వాధీనం చేసుకుని రాజమండ్రి ప్రభుత్వ దవాఖానకు తరలించారు. నిందితురాలు అనూషను అరెస్టు చేశారు. ఆమెపై కేసు దర్యాప్తు చేస్తున్నారు.