క్యాన్సర్ కణాలను నల్ల నువ్వులతో చేసిన ఉండలు తరిమికొడతాయని ఆయుర్వేద నిపుణులు చెప్తున్నారు. నల్లనువ్వులతో చేసే వంటకాలను ఆహారంలో భాగం చేసుకోవడం ద్వారా క్యాన్సర్‌ను ఇట్టే తరిమికొట్టవచ్చు. నువ్వుల మిఠాయి, నల్ల నువ్వులతో చేసిన ఉండలు, నల్ల నువ్వుల పొడిని చిన్న పెద్దా లేకుండా తీసుకోవచ్చు. నల్ల నువ్వుల్లో పోషకాలు పుష్కలంగా వున్నాయి. నల్ల నువ్వులు క్యాన్సర్‌ను దరిచేరనివ్వదు.
నల్ల నువ్వులను వంటల్లో చేర్చుకోవడం ద్వారా ఆరోగ్యంగా వుండవచ్చు. రెండు రోజులకు ఒక గుప్పెడు నల్ల నువ్వులను తీసుకోవడం ద్వారా అనారోగ్య సమస్యలకు చెక్ పెట్టవచ్చు. నల్ల నువ్వులు వ్యాధినిరోధక శక్తిని పెంచుతాయి. ఇందులోని యాంటీయాక్సిడెంట్లు, ఒమెగా త్రీ ఫ్యాట్స్, క్యాల్షియం, ఫాస్పరస్, మెగ్నీషియం, పొటాషియం, విటమిన్ ఎలు శరీరానికి కావలసిన పోషకాలను అందిస్తాయి.
మహిళలు రోజూ నల్ల నువ్వులను తీసుకోవచ్చు. ఇది బ్రెస్ట్ క్యాన్సర్‌ను దూరం చేస్తుంది. పేగు క్యాన్సర్, బ్లడ్ క్యాన్సర్‌లకు కూడా ఇది చెక్ పెడుతుంది. పేగుల్లోని చెడు కొలెస్ట్రాల్‌ను తరిమికొడుతుంది. తెలుపు నువ్వుల కంటే నలుపు నువ్వులే ఆరోగ్యానికి మేలు చేస్తాయి. ఇవి శరీరంలోని ట్యాక్సిన్లను తొలగిస్తాయి. జ్ఞాపకశక్తిని పెంచుతాయి. హెయిర్ ఫాల్ సమస్యను లేకుండా చేస్తాయి.
అజీర్తి సమస్యలను నయం చేసే నల్ల నువ్వులను రోజూ అర స్పూన్ తీసుకోవడం చాలామంచిది. బియ్యంతో లేదా ఓట్స్‌తో కలిపి తీసుకుంటే మంచి ఫలితం వుంటుందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.