Webdunia - Bharat's app for daily news and videos

Install App

పెళ్లి, పెళ్లాం, పిల్లలే జీవితం కాదు.. ఆడవారి అవసరాలు తీర్చాలంటున్న బాబు...

అవసరాల శ్రీనివాస్ నటిస్తూ, నవీన్ మేడారం దర్శకత్వం వహించిన చిత్రం "బాబు బాగా బిజీ". ఈ చిత్రం వచ్చే నెల ఐదో తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. బాలీవుడ్ చిత్రం 'హంటర్' ఆధారంగా రూపొందిస్తున్నాం. అవసరాల శ్ర

Webdunia
బుధవారం, 19 ఏప్రియల్ 2017 (10:13 IST)
అవసరాల శ్రీనివాస్ నటిస్తూ, నవీన్ మేడారం దర్శకత్వం వహించిన చిత్రం "బాబు బాగా బిజీ". ఈ చిత్రం వచ్చే నెల ఐదో తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. బాలీవుడ్ చిత్రం 'హంటర్' ఆధారంగా రూపొందిస్తున్నాం. అవసరాల శ్రీనివాస్ పాత్ర చిత్రణ కొత్తగా వుంటుంది.
 
ఈ చిత్రం కథంపై అవసరాల మాట్లాడుతూ... "పెళ్లి, పెళ్లాం, పిల్లలే జీవితమనుకుంటే పొరపాటే. ఇంకేదో కావాలని ఆశపడాలి. ఎదుటివారిలోని అవసరాల్ని అవకాశాలు మలచుకోవడంలో బాబు సిద్ధహస్తుడు. అలాంటి బాబులో ఎలా మార్పు వచ్చింది? పెళ్లి చేసుకోవాలని అతడు ఎందుకు నిర్ణయించుకున్నాడు? అనేది తెలియాలంటే బాబు బాగా బిజీ సినిమా చూడాల్సిందే"నని అవసరాం అంటున్నారు. 
 
శ్రీ అభిషేక్ పిక్చర్స్ పతాకంపై అభిషేక్ నామా నిర్మిస్తున్నారు. నవీన్ మేడారం దర్శకుడు. మిస్తీ చక్రవర్తి, తేజస్వి మదివాడ, సుప్రియ ఐసోల, శ్రీముఖి కథానాయికలుగా నటిస్తున్నారు. రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న చిత్రమిది. పెళ్లంటే సదభిప్రాయం లేని ఓ యువకుడి జీవితంలోకి వచ్చిన అమ్మాయిలెవరు? వారి కారణంగా అతడు ఎలాంటి కష్టాలనెదుర్కొన్నాడు?అనే అంశాలు ఆసక్తికరంగా వుంటాయి. 
 
ఇప్పటికే విడుదలైన ఈ చిత్రం టీజర్‌కు చక్కటి స్పందన వచ్చింది. సునీల్‌కశ్యప్ బాణీలు అలరిస్తున్నాయి. యువతరాన్ని ఈ చిత్రం తప్పకుండా మెప్పిస్తుందనే నమ్మకముంది అన్నారు. తనికెళ్ల భరణి, పోసాని కృష్ణమురళి, అన్నపూర్ణమ్మ, ప్రియదర్శి, రవిప్రకాష్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: సురేష్ భార్గవ, సంగీతం: సునీల్‌కశ్యప్, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: నవీన్ మేడారం.
అన్నీ చూడండి

తాజా వార్తలు

ఒసే నా ప్రియురాలా.... నీ భర్త బాధ వదిలిపోయిందే...

'ఛోళీకే పీఛే క్యాహై' పాటకు వరుడు నృత్యం... పెళ్లి రద్దు చేసిన వధువు తండ్రి!

ఓ వైపు బాలయ్య.. మరోవైపు భువనేశ్వరి.. ఇద్దరి మధ్య నలిగిపోతున్నా... సీఎం చంద్రబాబు

రాందేవ్ బాబాకు అరెస్ట్ వారెంట్ జారీ... ఎందుకో తెలుసా?

కాలువలోకి దూసుకెళ్లిన జీపు... 9 మంది మృత్యువాత (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

స్ట్రాబెర్రీలు తింటే 7 ఆరోగ్య ప్రయోజనాలు

ఆడోళ్లకు కూడా కండోమ్స్ వచ్చేశాయి.. ఎలా వాడాలో తెలుసా?

ఆటలో అరటి పండు కాదు ఆరోగ్యానికి అరటి పండు

ఆత్రేయపురం పూతరేకులను తినడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలేంటో తెలుసా?

ఇబ్బంది పెట్టే మైగ్రేన్‌ను వదిలించుకోవడానికి సింపుల్ చిట్కాలు

తర్వాతి కథనం
Show comments