Webdunia - Bharat's app for daily news and videos

Install App

టీఆర్పీ రేటింగ్‌ల కోసం ఏదో చేస్తే... పోలీసులు నన్ను పట్టుకున్నారు... నటుడు పృధ్వీ

Webdunia
బుధవారం, 20 మార్చి 2019 (12:10 IST)
టీఆర్‌పీ రేటింగ్‌ల కోసం టీవీ ఛానెల్‌లు చేసే హడావుడి ఒక్కోసారి చాలా ఇబ్బందులకు గురిచేస్తాయి. అప్పట్లో ‘పెళ్లి’ సినిమాతో ఒక్కసారిగా పాపులర్ అయిపోయిన నటుడు ప‌ృధ్వీరాజ్‌కి కూడా ఇలాంటి అనుభవమే ఎదురైందట.
 
వివరాలలోకి వెళ్తే... అనుకోకుండా డైరెక్టర్ కె.బాలచందర్ రూపంలో అవకాశం పొందిన పృధ్వీ... ఆ తర్వాత దాదాపు 200 సినిమాల్లో నటించారు. అయితే ఓ టీవీ ఛానెల్ ఇంటర్వ్యూలో ఆయన చెప్పిన పూర్తి విషయాన్ని చూపించకుండా ‘అవును నేను సూసైడ్ చేసుకున్నా’ అన్న మాటను మాత్రం సదరు ఛానెల్ వారు చూపించారట. దాంతో, పోలీసులు కూడా వచ్చి తన ఇంటి తలుపు తట్టారట. 
 
ఈ విషయాన్ని ఆయన ఇటీవలి ఓ టీవీ షోలో గుర్తు చేసుకుంటూ, ‘‘గతంలో ఒక తమిళ ఛానల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చాను. నేను చెప్పిన కథ మొత్తాన్నీ చూపించకుండా ‘అవును సూసైడ్‌ చేసుకున్నా’ అన్న మాటను మాత్రమే వాళ్లు టీవీలో చూపించారు. దాంతో ఈ వార్తలు మరింతగా పెరిగి... ఏకంగా పోలీసులు కూడా ఇంటికి వచ్చేసారని చెప్పారు. 
 
అసలు ఇంతకి ఏం జరిగిందంటే.. సూసైడ్‌పై నేను ఒక షార్ట్‌ ఫిలిం చేసాను. అది చూసి నిజంగా నేను సూసైడ్‌ చేసుకున్నాననే ఉద్దేశ్యంతో నాకూ, ఇంటికీ అందరూ ఒకటే ఫోన్లు. మలేషియా నుంచి కూడా ఒకమ్మాయి ఫోన్‌ చేసింది. ‘సర్‌ మీరు సూసైడ్‌ చేసుకున్నారా’ అని అడిగితే అవునమ్మా అన్నా. ‘సర్‌ దయ చేసి ఆత్మహత్య చేసుకోవద్దు’ అని చెప్తూ.. ‘అవునూ, మీరు సూసైడ్‌ చేసుకుంటే ఎలా మాట్లాడుతున్నారు’ అంటూ ఆశ్చర్యపోయింది. ఇక్కడ స్వర్గంలో వైఫై ఫ్రీగా పెట్టారు అనేసరికి ఠక్కున ఫోన్‌ పెట్టేసింది’’ అని తెలిపారు.
 
ఇదండీ టీఆర్పీ రేటింగ్‌ల గోల...

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

12 అడుగుల భారీ గిరినాగు.. రక్తపింజరను మింగేసింది.. ఎలా పట్టుకున్నారంటే? (video)

అరిఘాత్‌ నుండి కే-4 క్షిపణి ప్రయోగం విజయవంతం

టాయిలెట్‌ పిట్‌లో ఇరుక్కుపోయిన నవజాత శిశువు మృతదేహం.. ఎక్కడ?

ప్రజలు చిత్తుగా ఓడించినా జగన్‌కు ఇంకా బుద్ధిరాలేదు : మంత్రి సత్యకుమార్

కానిస్టేబుల్ కర్కశం... కన్నతల్లిని కొట్టి చంపేశాడు..

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లవంగం పాలు ఆరోగ్య ప్రయోజనాలు

చియా విత్తనాలు అద్భుత ప్రయోజనాలు

Winter Fruit కమలా పండ్లును తింటే ప్రయోజనాలు

ఎర్ర జామ పండు 7 ప్రయోజనాలు

ఉసిరికాయలను తేనెలో ఊరబెట్టి తింటే?

తర్వాతి కథనం
Show comments