Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాహుబలి 2 హిందీ శాటిలైట్ రైట్స్ అంత పలికిందా? వామ్మో రూ.51కోట్లతో సోనీకే ఆ ఛాన్స్!

బాహుబలి ది బిగినింగ్ ద్వారా ప్రపంచ సినీ ప్రేక్షకులను తెలుగు సినీ ఇండస్ట్రీ వైపు తిరిగి చూసేలా చేసిన దర్శకధీరుడు రాజమౌళి ప్రస్తుతం బాహుబలి 2 (ది కన్‌క్లూజన్)ను రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవలే ఈ

Webdunia
సోమవారం, 17 అక్టోబరు 2016 (16:23 IST)
బాహుబలి ది బిగినింగ్ ద్వారా ప్రపంచ సినీ ప్రేక్షకులను తెలుగు సినీ ఇండస్ట్రీ వైపు తిరిగి చూసేలా చేసిన దర్శకధీరుడు రాజమౌళి ప్రస్తుతం బాహుబలి 2 (ది కన్‌క్లూజన్)ను రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవలే ఈ సినిమా నైజాం రైట్స్‌ను ఎసియన్ ఎంటర్ ప్రైజెస్ అధినేతలు నారాయణ్ దాస్ నారంగ్, సునీల్ నారంగ్ లు 50 కోట్లకు దక్కించుకున్న సంగతి తెలిసిందే.
 
తాజాగా ఈ మూవీ హిందీ శాటిలైట్ రైట్స్‌ను సోనీ టీవీ రూ.51కోట్లకు దక్కించుకుంది. ఇంకా ఈ మొత్తానికి సర్వీస్ ట్యాక్స్ లు అదనం. బాహుబలి పార్ట్ 1(ద బిగినింగ్) ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీసులను కొల్లగొట్టడంతో పార్ట్ 2కు మంచి హైప్ క్రియేట్ అయింది. దీంతో బాహుబలి కోసం మార్కెట్ వర్గాలు క్యూకడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ సినిమా శాటిలైట్ రైట్స్ భారీగా పలకడం ట్రేడ్ వర్గాల్లో సంచలనంగా మారింది.
 
ఇకపోతే.. ప్రభాస్, అనుష్క, రానా, నాజర్, సత్యరాజ్ తదితరులు నటించిన బాహుబలి 2 సినిమా ఓవర్సీస్ రైట్స్ తెలుగు, తమిళం, హిందీ కలిసి థియేటర్ రైట్స్ రూ.47కోట్లకు అమ్మినట్టు ఇప్పటికే వార్తలు వినిపిస్తున్నాయి. రిలీజ్‌కు ముందే భారీగా పలికే బాహుబలి2.. విడుదలయ్యాక ఎలాంటి సంచనాలు సృష్టిస్తుందో వేచి చూడాలి. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

Vallabhaneni Vamsi వల్లభనేని వంశీ ఇలా జావగారిపోయారేంటి? ఏమైంది? (video)

రూ.6 కోట్ల మోసం కేసులో శ్రవణ్ రావు అరెస్టు!!

పాక్ ఉద్యోగికి భారత్ డెడ్‌లైన్ - 24 గంటల్లోగా దేశం విడిచి వెళ్ళిపోవాలంటూ హుకుం..

తెలంగాణాలో పలు జిల్లాల్లో ఆరెంజ్ అలెర్ట్!!

అమ్మాయిలపై అత్యాచారం, బ్లాక్ మెయిల్: ఆ 9 మంది బ్రతికున్నంతవరకూ జైలు శిక్ష

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రోజూ ఒక చెంచా తేనె సేవిస్తే ఏమవుతుంది?

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments