Webdunia - Bharat's app for daily news and videos

Install App

దంగల్ రికార్డును బ్రేక్ చేసిన బాహుబలి2.. 24 గంటల్లోనే 10లక్షలకు పైగా?

దర్శక ధీరుడు రాజమౌళి సినిమా బాహుబలి-2 కలెక్షన్ల పరంగా కుమ్మేస్తోంది. ఈ సినిమా బాక్సాఫీసు రికార్డులను తిరగరాస్తోంది. ఈ క్రమంలో బాలీవుడ్ స్టార్ అమీర్ ఖాన్ చిత్రం దంగల్ అడ్వాన్స్ బుకింగ్ రికార్డును బద్ధల

Webdunia
శుక్రవారం, 28 ఏప్రియల్ 2017 (09:37 IST)
దర్శక ధీరుడు రాజమౌళి సినిమా బాహుబలి-2 కలెక్షన్ల పరంగా కుమ్మేస్తోంది. ఈ సినిమా బాక్సాఫీసు రికార్డులను తిరగరాస్తోంది. ఈ క్రమంలో బాలీవుడ్ స్టార్ అమీర్ ఖాన్ చిత్రం దంగల్ అడ్వాన్స్ బుకింగ్ రికార్డును బద్ధలు కొట్టింది. ఈ చిత్రం అడ్వాన్స్ బుకింగ్ టికెట్లు కేవలం 24 గంటల్లోనే ఆన్ లైన్ లో 10 లక్షలకు పైగా అమ్ముడుపోయినట్టు బుక్ మై షో, సినిమాస్ సీఓఓ ఆశిష్ సక్సేనా తెలిపారు. 
 
ఈ టికెట్లకోసం డిమాండ్ కనీవినీ ఎరుగని రీతిలో ఉందని సక్సేనా వెల్లడించారు. అన్ని భాషలకు సంబంధించి మేం అప్పుడే 10 లక్షలకు పైగా టికెట్లు అమ్మాం. దక్షిణాది నుంచే కాక ఉత్తరాది నుంచి కూడా మార్కెట్లలో స్పందన విపరీతంగా ఉంది అన్నారు. రాబోయే రోజుల్లో టికెట్ల అమ్మకాలు మరింత పెరగగలవని ఆశిస్తున్నట్టు సక్సేనా చెప్పారు.
 
ఇదిలా ఉంటే.. బాహుబలి-2: ద కన్ క్లూజన్‌పై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ప్రభాస్ పెదనాన్న, రెబల్ స్టార్ కృష్ణంరాజు ఈ సినిమాపై ప్రశంసలు కురిపించారు. బెనిఫిట్ షో చూసిన అనంతరం ఆయన మాట్లాడుతూ, ఈ సినిమాలో ప్రతి ఫ్రేమ్ కనులకు ఇంపుగా ఉందని తెలిపారు. తెలుగు సినిమా చరిత్రగతిని మార్చిన సినిమాగా, భారతీయ సినిమా స్థాయిని పెంచిన సినిమాగా బాహుబలిని పేర్కొనవచ్చని అభిప్రాయపడ్డారు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

కార్చిచ్చులో కాలిపోయిన hollywood సెలబ్రిటీల ఆస్తులు, పదివేల ఇళ్లకు పైగా బుగ్గి (video)

Rahul Gandhi: తెలంగాణలో జనవరి 27న మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ పర్యటన

బోయ్‌ఫ్రెండ్ కష్టాల్లో వున్నాడని భర్త డబ్బును ట్రాన్స్‌ఫర్ చేసింది... ఆ తర్వాత? (video)

స్మార్ట్‌ఫోన్ కోసం కుమారుడి ఆత్మహత్య.. అదే తాడుతో ఉరేసుకున్న తండ్రి.. ఎక్కడ?

Nara Lokesh: జగన్ మామ మోసం చేసినా చంద్రన్న న్యాయం చేస్తున్నారు.. నారా లోకేష్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చలి కాలంలో బొంతను పూర్తిగా ముఖాన్ని కప్పేసి పడుకుంటే ఏం జరుగుతుంది?

పరోటా తింటే ఏం జరుగుతుందో తప్పక తెలుసుకోవాల్సినవి

దొండ కాయలు గురించి ఆయుర్వేదం ఏం చెబుతోంది?

సంక్రాంతి పండుగకి పోషకాలతో కూడిన కాలిఫోర్నియా బాదం వంటకం

అరటి కాండం రసం తాగితే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments