"B.కాంలో ఫీజిక్స్" ట్రైలర్ విడుద‌ల‌

Webdunia
శనివారం, 17 ఏప్రియల్ 2021 (18:20 IST)
B.Com Physics, movie, trailer
అంకిత, అవంతిక, మేఘన,నగరం సునీల్,జబర్దష్ అప్పారావు నటీ నటులుగా శ్యామ్ జె చైతన్య స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్న"B.కాంలో ఫీజిక్స్" చిత్రం ట్రైలర్ను దర్శకుడు శివనాగేశ్వర‌రావు విడుదల చేశారు. అనంతరం ఆయ‌న మాట్లాడుతూ, ట్రైలర్ చాలా బాగుంది.ఈ సినిమాలో బోలెడు కంటెంట్ తో పాటు బోల్డ్ కంటెంట్ కూడా ఉంది. సున్నితమైన అంశాన్ని చక్కగా తెరకెక్కిస్తూ ఒక మంచి ప్రయోగంతో ప్రేక్షకుల ముందుకు వస్తున్న చిత్ర దర్శకుడికి ఈ సినిమా గొప్ప విజయం సాధించాలని ఆకాంక్షించారు.
 
చిత్ర దర్శక, నిర్మాత శ్యామ్ జె చైతన్య  మాట్లాడుతూ, చెన్నై ఎక్స్ ప్రెస్ కు వర్క్ చేసిన రైటర్ దగ్గర 10 సంవత్సరాలు ప‌నిచేశా. ఎడిటింగ్, డైరక్షన్ ఫీల్డ్ లలో మెళుకువ‌లు నేర్చుకొని కన్నడలో రెండు సినిమాలకు డైరెక్షన్ చేసి ప్రొడ్యూస్ చేశాను. తెలుగులో "ఆవు పులి మధ్యలో ప్రభాస్ పెళ్లి", "ఏడు చేపల కథ" సినిమాలు తీశాను. మూడవ సినిమా "B.కాంలో ఫీజిక్స్" కు దర్శకత్వం చేసి నిర్మించడం జరిగింది. అమ్మాయిలపై జరుగుతున్న రేప్ లను అరికట్టడానికి ఈ మధ్య చాలా సినిమాలు వచ్చాయి. రీసెంట్ గా వచ్చిన పవన్ కళ్యాణ్ సినిమా వకీల్ సాబ్ కూడా అటువంటిదే. ఈ సినిమాలో రేప్ కు గురైన ఒక అమ్మాయి తన పాయింట్ ఆఫ్ వ్యూలో వైల్డ్ గా తీసుకున్న నిర్ణ‌యం ఏమిట‌నేది ఆస‌క్తిక‌రం. ఈ కథలో కామెడీని జోడించి ప్ర‌యోగాత్మ‌కంగా చూపించాం. షూటింగ్ పూర్తి చేసుకున్నఈ సినిమా త్వరలో సెన్సార్ కు వెళుతుంది.అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని మే లో సినిమాను విడుదల చేస్తామని` అన్నారు.
 
హీరోయిన్ లో ఒకరైన మేఘన మాట్లాడుతూ, ఇప్పటి వరకు చేయని డిఫ్రెంట్ రోల్ ను ఈ సినిమాలో నటించానని తెలిపారు.
కమెడియన్ అప్పారావు మాట్లాడుతూ, నాకు మంచి క్యారెక్టర్ ఇచ్చారు."అవు పులి మధ్యలో ప్రభాస్ పెళ్లి"లో చేసిన పాత్రకు మించి ఇందులో నా పాత్ర ఉంటుంది. సున్నితమైన అంశాన్ని దర్శకుడు చక్కగా తెరకెక్కించాడు. ఈ చిత్రం దర్శక,నిర్మాతలకు గొప్ప విజయం సాధించి మరెన్నో చిత్రాలు నిర్మిస్తూ మాలాంటి వారికి  అవకాశం కల్పించాలని అన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మీరు కాదు, మేము విధించే 5 షరతులు ఒప్పుకుంటే సరే, లేదంటే యుద్ధం ఆగదు: ఇరాన్

చంద్రబాబుకు భయపడొద్దు... జగన్ 2.0లో కార్యకర్తలకు ప్రాధాన్యత : వైఎస్ జగన్

పాల క్యానుల్లో పెట్రోల్ కొట్టించుకుంటున్నారు, ఇంక ఏం దొరుకుతుంది అన్నాయ్ (video)

కల్తీ మద్యంతో రాష్ట్రాన్ని దోచుకున్న వ్యక్తి జగన్ : మంత్రి గొట్టిపాటి

ప్రతి చిన్న విషయాన్ని వైకాపా సైతాన్లు టార్గెట్ చేస్తున్నారు : వైఎస్ షర్మిల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సిప్లా నుంచి మసాలా జామ రుచితో ప్రోలైట్‌ ఓఆర్ఎస్‌ పోర్ట్‌ఫోలియో

వెన్ను నొప్పి పారదోలే చిట్కాలు

పుచ్చకాయ తింటే ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

ఆనందం, ఆదరణ, నివారణ సంరక్షణతో వృద్ధాప్యాన్ని పునర్నిర్వచించాలని జాతీయ పిలుపు

మార్కెట్లోకి నకిలీ కోడిగుడ్లు, గుర్తించడం ఎలా?

తర్వాతి కథనం
Show comments