Webdunia - Bharat's app for daily news and videos

Install App

సూపర్ హీరోయిన్‌కు వేధింపులు.. చంపేస్తామని బెదిరింపులు.. ఎవరు?

సినీ హీరోయిన్లకు ఓ వైపు క్యాస్టింగ్ కౌచ్‌తో తలనొప్పి తప్పట్లేదు. మరోవైపు బయటి వ్యక్తుల నుంచి హీరోయిన్లు వేధింపులు ఎదుర్కొంటున్నారు. తాజాగా తెలుగులో ''సూపర్'' చిత్రంతో సినీ ప్రేక్షకులను పలకరించిన ఆయేషా

Webdunia
బుధవారం, 4 జులై 2018 (12:56 IST)
సినీ హీరోయిన్లకు ఓ వైపు క్యాస్టింగ్ కౌచ్‌తో తలనొప్పి తప్పట్లేదు. మరోవైపు బయటి వ్యక్తుల నుంచి హీరోయిన్లు వేధింపులు ఎదుర్కొంటున్నారు. తాజాగా తెలుగులో ''సూపర్'' చిత్రంతో సినీ ప్రేక్షకులను పలకరించిన ఆయేషా టకియాకు కూడా అదే పరిస్థితి ఏర్పడింది.


అయేషాతో పాటు, ఆమె కుటుంబీకులను ఓ వ్యక్తి వేధిస్తున్నాడట. చంపేస్తానని బెదిరిస్తున్నాడట. ఈ విషయాన్ని ఆయేషా భర్త ఫర్హాన్ అజ్మీ తన ట్విట్టర్ ఖాతాలో వెల్లడిస్తూ, ముంబై పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని ఆరోపించారు. 
 
బెదిరింపులు, వేధింపులు పెరిగిపోతున్న కారణంగా ఈ వ్యవహారంలో ప్రధాని నరేంద్ర మోదీ, సుష్మా స్వరాజ్‌లు తమకు సాయపడాలని విజ్ఞప్తి చేస్తూ ''బేటీ బచావో'' అని ఓ పోస్టు పెట్టారు. డీసీపీ దహియాకు ఫిర్యాదు చేస్తే ఆయన చూసీ చూడనట్టు ఊరుకున్నారని ఆరోపించారు. 
 
ఇంకా దహియాకు చేసిన మెసేజ్ స్క్రీన్ షాట్లను ఫర్హాన్ పోస్టు చేసి, తమకు మద్దతు తెలపాలని నెటిజన్లను కోరారు. ఆయన వరుసగా ట్వీట్లు పెడుతుండటంతో ముంబై జాయింట్ సీపీ దేవేన్ భారతి స్పందించి, విచారించి నిందితుడిని అరెస్ట్ చేస్తామని హామీ ఇచ్చారు. ఇంకా నెటిజన్లు కూడా ఫర్హాన్‌కు మద్దతు తెలుపుతూ పోస్టులు చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

టీడీపీ జెండాను పట్టుకున్న నందమూరి హీరో కళ్యాణ్ రామ్.. మా మధ్య అవి లేవండి?

అన్నా ఒకసారి ముఖం చూస్కో.. ఎలా అయిపోయావో.. వంశీ అభిమానుల ఆందోళన (video)

అమరావతిలో చంద్రబాబు శాశ్వత ఇంటి నిర్మాణం ప్రారంభం.. ఎప్పుడు.. ఎక్కడ?

ఎస్బీఐ బ్యాంకు దొంగతనం- బావిలో 17 కిలోల బంగారం స్వాధీనం

మయన్మార్‌ భూకంపం.. 2,056కి పెరిగిన మృతుల సంఖ్య

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయి అధికబరువు తగ్గిపోవాలంటే?

దగ్గుతో రక్తం కక్కుకుంటున్నారు, రష్యాలో కొత్తరకం వైరస్, వేలల్లో రోగులు

అలాంటి వేరుశనక్కాయలు, ఎండుమిర్చి తింటే కేన్సర్ ప్రమాదం

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

తర్వాతి కథనం
Show comments