Webdunia - Bharat's app for daily news and videos

Install App

అవెంజర్స్ ఎండ్ గేమ్‌కు విపరీతమైన క్రేజ్... ఎందుకంటే?

Webdunia
గురువారం, 25 ఏప్రియల్ 2019 (13:08 IST)
మార్వెల్ సంస్థ నుంచి ఇప్పుడు వస్తోన్న ఎవెంజర్స్ ది ఎండ్ గేమ్ సినిమాకు ప్రపంచవ్యాప్తంగా భారీ డిమాండ్ ఉంది. జనాల్లో ఈ సినిమా పట్ల పిచ్చి పీక్స్‌కు చేరింది. చాలా రోజుల నుంచే ఈ సినిమా టికెట్‌ల కోసం ప్రజలు విపరీతంగా ప్రయత్నాలు చేస్తున్నారు.


అమెరికాలో అయితే మొదటి మూడు రోజులకు టికెట్‌ల బుకింగ్స్ పూర్తయ్యాయి. కొన్ని దేశాల్లో అయితే రోజుకు 100 షోలు వేస్తున్నా కూడా సరిపోవడం లేదట. విడుదల చేసిన క్షణాల్లో టికెట్‌లు అమ్ముడు పోతూ రికార్డులు సృష్టిస్తోంది ఈ సినిమా.
 
కేవలం అమెరికాలోనే మొదటి మూడు రోజుల్లో ఈ సినిమా దాదాపుగా $300 మిలియన్ డాలర్లు వసూలు చేయవచ్చని హాలీవుడ్ ట్రేడ్ వర్గాల అంచనా. భారతదేశంలో కూడా ఈ సినిమాకు భారీ ఓపెనింగ్స్ వస్తాయని అంచనా.

ఎవెంజర్స్ సినిమాకు ఇలా విపరీతమైన డిమాండ్ ఏర్పడటానికి కారణం ఏమిటి, ప్రేక్షకులు ఈ సినిమా కోసం ఎందుకు అంతగా పడిగాపులు కాస్తున్నారంటే... గతంలో ఎవెంజర్స్ సీరీస్‌లో విడుదలైన మూడు సినిమాలు కూడా అఖండ విజయాన్ని సాధించాయి. 
 
ముఖ్యంగా మూడో సినిమా ఎవెంజర్స్ ఇన్ఫినిటీ వార్ అయితే కలెక్షన్ల సునామీ సృష్టించింది. దీంతో నాలుగో సీరీస్‌పై అంచనాలు అమాంతం పెరిగాయి.

ఇంకా ఈ సిరీస్‌లో ఇదే చివరి సినిమా అని మార్వెల్ సంస్థ ప్రకటించడంతో డిమాండ్ మరింత ఊపందుకుంది. చూస్తుంటే ఈ సినిమా ఇప్పటి వరకున్న ప్రపంచ రికార్డులన్నింటిని బద్దలుకొట్టేలా కనిపిస్తోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

చిన్నారిపై హత్యాచారం చేసిన నిందితుడి ఎన్‌కౌంటర్: PSI అన్నపూర్ణకు అభినందనలు

పంచ్‌లు - కిక్‌లు లేకుండా నిస్సారంగా సాగిన రోబోల బాక్సింగ్ (Video)

కారు డోర్ లాక్ : ఊపిరాడక అక్కా చెల్లెళ్లు మృతి

గర్భిణీ భార్యను గొంతు నులిమి హత్య చేసిన కసాయి భర్త!!

తరగతి గదులను కూల్‌గా ఉంచేందుకు ఆ లేడీ టీచర్ ఏం చేసిందో తెలుసా? (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డ్రాగన్ ఫ్రూట్ తినడం వల్ల ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

తర్వాతి కథనం
Show comments