Webdunia - Bharat's app for daily news and videos

Install App

101 జిల్లాల‌ అంద‌గాడు`గా అవ‌స‌రాల శ్రీనివాస్

Webdunia
శుక్రవారం, 26 మార్చి 2021 (06:33 IST)
101 Zillala Andagadu look
డిఫ‌రెంట్ సినిమాలకు ఈ మ‌ధ్య తెలుగు ప్రేక్ష‌కులు బ్ర‌హ్మ‌ర‌థం ప‌డుతున్నారు. దీంతో కొత్త త‌రం ద‌ర్శ‌కులు వైవిధ్య‌మైన చిత్రాలు, పాత్ర‌ల‌తో తెలుగు ప్రేక్ష‌కుల‌ను అల‌రిస్తున్నారు. ఈ నేప‌థ్యంలో యంగ్ టాలెంట్‌ను ఎంక‌రేజ్ చేయ‌డానికి హిట్ చిత్రాల నిర్మాత దిల్‌రాజు, ద‌ర్శ‌క నిర్మాత క్రిష్ జాగ‌ర్ల‌మూడి క‌లిసి డిఫ‌రెంట్ సినిమాను రూపొందిస్తున్నారు. న‌టుడిగా, ద‌ర్శ‌కుడిగా త‌న ప్ర‌త్యేక‌త‌ను చాటుకుంటోన్న అవ‌స‌రాల  శ్రీనివాస్ టైటిల్ పాత్ర‌లో న‌టిస్తోన్న ఎంట‌ర్‌టైన‌ర్. ‘101 జిల్లాల అంద‌గాడు’. రాచ‌కొండ విద్యాసాగ‌ర్ ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతున్న ఈ చిత్రాన్ని శ్రీవెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్‌, ఫ‌స్ట్ ఫ్రేమ్ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్స్‌పై  దిల్‌రాజు, డైరెక్ట‌ర్ క్రిష్ స‌మ‌ర్ప‌ణ‌లో శిరీష్, రాజీవ్ రెడ్డి, సాయి బాబు జాగ‌ర్ల‌మూడి  నిర్మిస్తున్నారు. గురువారం ఈ సినిమా ఫ‌స్ట్‌లుక్‌ను చిత్ర యూనిట్ విడుద‌ల చేసింది. 
 
ఫ‌స్ట్‌లుక్ చూస్తే అవ‌స‌రాల శ్రీనివాస్ బ‌ట్ట‌త‌ల‌తో క‌నిపిస్తున్నారు. తెలుగు సినిమాల్లో హీరోకు బ‌ట్ట‌త‌ల ఉండ‌ట‌మనేది ఇప్ప‌టి వ‌ర‌కు రాన‌టువంటి క‌థాంశం. ఇలాంటి కాన్సెప్ట్‌తో రూపొందుతోన్న `101 జిల్లాల‌ అంద‌గాడు` చిత్రంలో అవ‌స‌రాల శ్రీనివాస్ గొత్తి సూర్య నారాయ‌ణ అనే పాత్ర‌లో న‌టిస్తున్నారు. రుహ‌నీ శ‌ర్మ హీరోయిన్‌. టాలీవుడ్‌లో డిఫ‌రెంట్ మూవీస్‌లో న‌టుడిగా,సెన్సిబుల్ డైరెక్ట‌ర్‌గా, రైట‌ర్‌గా త‌న‌దైన గుర్తింపు సంపాదించుకున్న అవ‌స‌రాల శ్రీనివాస్  `101 జిల్లాల‌ అంద‌గాడు`  చిత్రంలో హీరోగా న‌టించ‌డ‌మే కాకుండా త‌న‌దైన కామెడీ పంచుల‌తో ప్రేక్ష‌కులు  ఎంజాయ్ చేసేలా మంచి ఎంట‌ర్‌టైనింగ్ క‌థ‌ను అందించారు. రామ్ సినిమాటోగ్ర‌ఫీ అందిస్తున్న ఈ చిత్రానికి శ‌క్తికాంత్ కార్తీక్ సంగీతాన్ని అందిస్తున్నారు. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ద‌శ‌లోఉంది. మే 7న సినిమాను విడుద‌ల చేస్తున్నారు ద‌ర్శ‌క నిర్మాత‌లు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మీడియా ప్రతినిధిని కావాలని కొట్టలేదు.. సారీ చెప్పిన మోహన్ బాబు (video)

తబలా విద్వాంసుడు జాకీర్ హుస్సేన్ ఇకలేరు..

కాకినాడలో కూలిన వేదిక.. కిందపడిన కూటమి నేతలు (Video)

వన్ నేషన్ - వన్ ఎలక్షన్‌పై కేంద్రం వెనక్కి తగ్గిందా?

ఏపీలో పొట్టి శ్రీరాములు పేరుతో తెలుగు యూనివర్శిటీ : సీఎం చంద్రబాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Ginger Milk in winter: శీతాకాలంలో అల్లం పాలు తాగితే?

Ber fruit: రేగు పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

పెరుగుతో ఇవి కలుపుకుని తింటే ఎంతో ఆరోగ్యం, ఏంటవి?

ఆరోగ్యం కోసం ప్రతిరోజూ తాగాల్సిన పానీయాలు ఏమిటో తెలుసా?

పులి గింజలు శక్తి సామర్థ్యాలు మీకు తెలుసా?

తర్వాతి కథనం
Show comments