Webdunia - Bharat's app for daily news and videos

Install App

కామెడీ - హారర్ చిత్రంగా 'అత్తారిల్లు'.. 2న ఆడియో రిలీజ్

Webdunia
ఆదివారం, 26 జూన్ 2016 (16:12 IST)
అంజన్‌ కళ్యాణ్‌ ఆర్ట్‌ క్రియేషన్స్‌ బ్యానర్‌పై అంజన్‌ కె.కళ్యాణ్ స్వీయ‌ దర్శకత్వం నిర్మిస్తున్న‌ చిత్రం ‘అత్తారిల్లు’. అంతా కొత్త నటీనటులతో రూపొందిన ఈ హర్రర్‌ కామెడీ చిత్రం సెన్సార్‌ పూర్తిచేసుకుంది. ఇటీవల విడుద‌ల చేసిన‌ ఫస్ట్ లుక్ పోస్ట‌ర్‌కు విశేష‌మైన స్పంద‌న ల‌భిస్తోంది. జూలై 2న ఈ చిత్ర ఆడియో గ్రాండ్‌గా విడుద‌ల చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నారు.
 
ఈ సంద‌ర్భంగా చిత్ర దర్శక నిర్మాత అంజన్‌ కె.కళ్యాణ్‌ మాట్లాడుతూ... ఇటీవ‌ల విడుద‌ల చేసిన ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్‌కు రెస్పాన్స్ బాగుంది. చాలా మంది ఫోన్ చేసి కాంప్లిమెంట్స్ ఇస్తుంటే మా టీమ్ అంతా ఎంతో ఉత్సాహంగా ఉంది. మెలోడీబ్ర‌హ్మ మ‌ణిశ‌ర్మ‌కి ఈ సినిమా నచ్చి అద్భుతమైన బ్యాక్‌ గ్రౌండ్‌ మ్యూజిక్‌ ఇచ్చారు. కడుపుబ్బ నవ్వించే కామెడీ, భయపెట్టించే థ్రిల్స్‌తో పాటు ఆడియ‌న్స్‌కి కావాల్సిన ఆల్‌ఎలిమెంట్స్ మా చిత్రంలో ఉన్నాయి. క‌థ‌, క‌థ‌నాలు కొత్త‌గా ఉంటాయి. డెన్నిస్ నార్టన్‌ సంగీత సార‌థ్యంలో రూపొందిన ఈ చిత్రంలోని పాట‌లు జూలై 2న గ్రాండ్‌గా రిలీజ్ చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నట్టు చెప్పారు. 
 
సాయి రవి కుమార్‌, అతిథి దాస్‌, నండూరి రాము, రాకేశ్‌ శర్మ, ఉదయ్‌ శరత్‌, జోజూ, ఆర్‌జె వంశీ రామరాజు, ఎక్కాల వినోద్‌ కుమార్‌, రాజేంద్ర పులి, రాజశేఖర్‌, మమత తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి బ్యాగ్రౌండ్‌ మ్యూజిక్‌: మణిశర్మ, పాటలు: డెన్నిస్‌ నార్టన్‌, కెమెరా: శివశంకర వరప్రసాద్‌, డాన్స్‌: జోజూ, ఫైట్స్‌: రెబల్‌ మాస్టర్‌, కో-డైరెక్టర్‌: కరణం వి లోకనాథ్‌, ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌: యం.హెచ్‌.రెడ్డి, సమర్పణ: అక్షయ్‌-అశ్విన్‌, కో- ప్రొడ్యూసర్స్‌: కాక‌ల్ల ల‌క్ష్మీ మ‌ల్ల‌య్య, జ్యోతి. కె. కళ్యాణ్‌, కథ - స్క్రీన్‌ప్లే - నిర్మాత - దర్శకత్వం: అంజన్‌ కె కళ్యాణ్‌. 

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments