Webdunia - Bharat's app for daily news and videos

Install App

గోపీనాథ్ - విష్ణుప్రియ జంటగా "21st సెంచరీ లవ్"

బి.ఆర్.ఎస్.ఐ పతాకంపై గోపీనాథ్‌ను హీరోగా పరిచయం చేస్తూ పోల్కంపల్లి నరేందర్ నిర్మిస్తున్న సందేశాత్మక ప్రేమకథా చిత్రం "21 సెంచరీ లవ్". ఈ చిత్ర దర్శకుడు గోపీనాథ్ కథానాయకుడిగా పరిచయమవుతున్న ఈ చిత్రంలో విష్

Webdunia
ఆదివారం, 26 జూన్ 2016 (15:37 IST)
బి.ఆర్.ఎస్.ఐ పతాకంపై గోపీనాథ్‌ను హీరోగా పరిచయం చేస్తూ పోల్కంపల్లి నరేందర్ నిర్మిస్తున్న సందేశాత్మక ప్రేమకథా చిత్రం "21 సెంచరీ లవ్". ఈ చిత్ర దర్శకుడు గోపీనాథ్ కథానాయకుడిగా పరిచయమవుతున్న ఈ చిత్రంలో విష్ణుప్రియ హీరోయిన్. థర్టీ ఈయర్స్ పృథ్వీ, నల్లవేణు, సుమన్ శెట్టి తదితరులు ఇతర ముఖ్యపాత్రలు పోషించారు. "గుంటూరు టాకీస్" చిత్రంతో ఘన విజయం అందుకొన్న ఆర్.కె.స్టూడియోస్ ద్వారా ఈ చిత్రం అతిత్వరలో విడుదలకానుంది.
 
 
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో చిత్ర దర్శకుడు, కథానాయకుడు గోపీనాథ్, నిర్మాత పోల్కంపల్లి నరేందర్, సంగీత దర్శకుడు కనిష్కలతోపాటు, ఈ చిత్రాన్ని నైజాంలో పంపిణీ చేస్తున్న ప్రముఖ నిర్మాత ప్రతాని రామకృష్ణగౌడ్ పాల్గొన్నారు. ప్రతి సన్నివేశంలోనూ వినోదాన్ని పండిస్తూనే కాస్తంత సందేశాన్ని కూడా జోడించిన ఆలోచనాత్మక ప్రేమకథగా తెరకెక్కించిన "ట్వంటీ ఫస్ట్ సెంచరీ లవ్" లవర్స్‌తోపాటు మూవీ లవర్స్ అందర్నీ ఖచ్చితంగా ఆకట్టుకుంటుందన్నారు. 
 
"గుంటూర్ టాకీస్"వంటి రీసెంట్ హిట్ ప్రొడ్యూసర్ రాజ్ కుమార్ బ్యానర్ ఆర్.కె.స్టూడియోస్ ద్వారా "ట్వంటీ ఫస్ట్ సెంచరీ లవ్" విడుదలవుతుండటం సంతోషంగా ఉందని నిర్మాత పోల్కంపల్లి నరేందర్ అన్నారు. సినిమా తనకు బాగా నచ్చిందని, అందుకే నైజాంలో డిస్ట్రిబ్యూట్ చేస్తున్నామని ప్రతాని రామకృష్ణ గౌడ్ అన్నారు. ఈ చిత్రానికి సంగీత సారథ్యం వహించే అవకాశం ఇచ్చిన దర్శకనిర్మాతలకు కనిష్క కృతజ్ఞతలని చెప్పారు. 

టీడీపీకి ఓటు వేశాడని ఓటరు చెవి కోసేసిన వైకాపా నేత!!

భార్య మార్పిడి.. నా ఫోటోలను స్నేహితులకు పంచుకున్నాడు.. ఆపై..?

ఆ రోజు సీఎం కేజ్రీవాల్ నివాసంలో ఏం జరిగిందంటే.. నోరు విప్పిన ఎంపీ స్వాతి మలివాల్

కూటమికి 120-150 ఎమ్మెల్యే స్థానాల్లో గెలుపు.. ఆర్ఆర్ఆర్ స్పీకరవుతారా?

యాంకర్‌పై పూజారి అత్యాచారం.. తీర్థంలో నిద్రమాత్రలు.. బెంజ్ కారులో..?

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

మెదడు ఆరోగ్యంపై ప్రభావం చూపే శారీరక శ్రమ

పరగడపున వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు ఇవే

తర్వాతి కథనం
Show comments