Webdunia - Bharat's app for daily news and videos

Install App

నటి షాలు చౌరాసియాపై దాడి: సిపి అంజినీకుమార్ ఆగ్రహం

Webdunia
మంగళవారం, 16 నవంబరు 2021 (11:46 IST)
హైదరాబాద్ నగరంలో ఉన్న పార్కుల్లో కేబీఆర్ పార్కు చాలా ప్రముఖుమైనది. ఎందుకంటే ఇక్కడ అనేక మంది వీవీఐపీలు ఈ పార్కులోనే వాకింగ్ చేస్తుంటారు. దీంతో భద్రత కూడా బాగానే ఉంటుంది. అలాంటి ప్రాంతంలో నటి చౌరాసియాపై ఓ దండుగుడు దాడికి పాల్పడ్డాడు. 

 
బంజారాహిల్స్‌ కేబీఆర్‌ పార్క్‌ రోడ్‌ నంబర్‌ 9 వద్ద నటి చౌరాసియాపై గుర్తుతెలియని వ్యక్తి ఆదివారం నాడు దాడి చేశాడు. తొలుత ఆమె ముఖానికి వస్త్రాన్ని బిగించాలని ప్రయత్నించాడు. దాంతో నటి అతడితో పెనుగులాడింది. ఈ క్రమంలో జరిగిన పెనుగులాటలో చౌరాసియాను ఈడ్చుకెళ్లి అక్కడ వున్న రాయికేసి తలను మూడుసార్లు కొట్టాడు. చౌరాసియా కేకలు వేయడంతో దుండగుడు ఆమె సెల్‌ఫోన్‌ను ఎత్తుకెళ్లాడు.

 
ఆ తర్వాత ఆమె అక్కడి నుంచి గోడ దూకి రోడ్డు మీదికి రావడంతో ఆటో డ్రైవర్లు గమనించి మంచినీళ్లు తాగించారు. వారి నుంచి ఫోన్ తీసుకున్న నటి డయల్‌ 100కు సమాచారం ఇవ్వడంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. నటి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. గాయపడిన ఆమెను సమీపంలోని ప్రైవేటు దవాఖానకు తరలించారు. ఆదివారం రాత్రి 8.30 గంటల సమయంలో వాకింగ్‌ వెళ్లగా ఈ ఘటన జరిగినట్లు పోలీసులు తెలిపారు.

 
ఈ ఘటనపై నగర సిపి అంజనీకుమార్ ఆగ్రహం వ్యక్తం చేసారు. దుండగుడిని గాలించి పట్టుకోవాలని ఆదేశించారు. పార్కు వద్ద ఘటనాస్థలంలో అమర్చిని సిసి కెమేరాలు పనిచేయకపోవడంపై అసహనం వ్యక్తం చేసారు. వెంటనే జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

దువ్వాడతో కొడుకుని కంటాను.. ఆయన లేక నేను లేను.. బయోపిక్ తీస్తాం.. దివ్వెల మాధురి (video)

వామ్మో... Cyclone Fengal తుపానులో చెన్నై రన్ వేపై విమానం జస్ట్ మిస్ (Video)

ఢిల్లీ మాజీ సీఎం కేజ్రీవాల్ ముఖంపై ద్రవం పోసిన వ్యక్తి

తెలంగాణలో రూ. 200 కోట్ల భారీ అవినీతి తిమింగలం నిఖేష్, ఏసీబి సోదాలు

విశాఖపట్నంలో జరిగిన కేబెల్ స్టార్ సీజన్ 3 విజేతలను ప్రకటించిన ఆర్ఆర్ కేబెల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఓట్స్ తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

విటమిన్ డి లభించే 5 పదార్థాలు, ఏంటవి?

గర్భాశయ క్యాన్సర్‌తో బాధ పడుతున్న 83 ఏళ్ల మహిళకు విజయవంతంగా చికిత్స

Mint Juice, శీతాకాలంలో పుదీనా రసం తాగితే?

లెమన్ టీ తాగుతున్నారా? ఐతే వీటిని తినకండి

తర్వాతి కథనం
Show comments