రామ్ చరణ్ - ఉపాసన దంపతుల ఇంట దీపావళి గ్రాండ్ పార్టీ.. హాజరైన తారాలోకం...

Webdunia
ఆదివారం, 12 నవంబరు 2023 (16:23 IST)
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ - ఉపాసన దంపతులు తమ కుమార్తె క్లింకారతో కలిసి తొలి దీపావళి పండుగను జరుపుకున్నారు. ఈ సందర్భంగా వారు తమ ఇంట గ్రాండ్‌గా విందు పార్టీ ఇచ్చారు. శనివారం రాత్రి ఏర్పాటు చేసిన ఈ విందు పార్టీలో అనేక సినీ ప్రముఖులు హాజరయ్యారు. ముఖ్యంగా, ఈ ఫ్యామిలీ పార్టీలో తారక్, మహేశ్ బాబులు తమతమ సతీమణులతో పాటు విక్టరీ వెంకటేశ్ హాజరయ్యారు.
 
తెలుగు చిత్రపరిశ్రమకు చెందిన పలువురు సినీ నటులు, దర్శకులు, సినీ నిర్మాతలు కూడా చెర్రీ దంపతులు ఇచ్చిన విందు పార్టీకి హాజరయ్యారు. ఈ పార్టీకి సంబంధించిన కొన్ని ఫోటోలను మహేశ్ బాబు సతీమణి నమ్రత తన ఇన్‌స్టా ఖాతాలో షేర్ చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. కాగా, "ఆర్ఆర్ఆర్" చిత్రం తర్వాత గ్లోబల్ స్టార్‌గా మారిన రామ్ చరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన "గేమ్ ఛేంజర్" చిత్రంలో నటిస్తున్నారు. ఇందులో కియారా అద్వానీ హీరోయిన్‌గా నటించగా, ప్రముఖ నిర్మాత దిల్ రాజు భారీ బడ్జెట్‌తో నిర్మించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

తెలంగాణ వ్యాప్తంగా అన్ని చెక్ పోస్టులు రద్దు - అవినీతి అధికారులకు చెక్

వేరే వ్యక్తితో తల్లి అక్రమ సంబంధం: కన్నతల్లిని పరుగెత్తించి నరికి చంపిన కొడుకు

పాకిస్తాన్‌లో ఆకాశాన్నంటిన ధరలు.. కిలో టమోటాలు రూ.600, అల్లం రూ.750

బంగాళాఖాతంలో అల్పపీడనం: రెడ్ అలర్ట్.. రానున్న 24 గంటల్లో భారీ వర్షాలు

భర్త పుట్టింటికి వెళ్లనివ్వలేదు.. కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకున్న మహిళ.. ఏమైంది?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆహారంలో అతి చక్కెర వాడేవాళ్లు తగ్గించేస్తే ఏం జరుగుతుందో తెలుసా?

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

ప్రపంచ ఆర్థరైటిస్‌ దినోత్సవం: రుమటాయిడ్ ఆర్థరైటిస్‌ను ముందస్తుగా గుర్తించడం ఎందుకు ముఖ్యం?

పుట్టగొడుగులు ఎవరు తినకూడదు?

తర్వాతి కథనం
Show comments