Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

పేకాట ఆడిన పెద్దోడు.. చిన్నోడు.. ఎవరా ఇద్దరు హీరోలు?

Advertiesment
playing cards
, సోమవారం, 6 నవంబరు 2023 (14:55 IST)
సోషల్ మీడియాలో టాలీవుడ్ హీరోలు వెంకటేష్, మహేష్ బాబులు కలిసి పేకాట ఆడుతున్న ఫోటోలు వైరల్ అయ్యాయి. ఈ ఫోటోలను చూసిన అనేక మంది మహేష్ బాబు కూడా కార్డ్స్ ఆడతాడా అని ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. 
 
స్వతహాగా మహేష్ ఎప్పుడూ ఓపెన్‌గా పార్టీస్‌లో కానీ, వేరే హీరోలతో కలిసి ఎంజాయ్ చేయడమనేది పెద్దగా కనిపించదు. ఎక్కువగా కుటుంబానికి ప్రాధాన్యత ఇస్తాడు. ప్రముఖుల పార్టీలకి హాజరైనా చాలా హుందాగా భార్యతో కలిసే హాజరయ్యే మహేష్‌ని పేకముక్కలు, డబ్బు కట్టలతో  చూసేసరికి అందరూ నిజంగానే షాకయ్యారు. 
 
ఈ దృశ్యాలు మహేష్ ఓ ప్రముఖ వ్యాపారవేత్తకు సంబంధించిన క్లబ్ హౌస్ ఓపెనింగ్‌కి విక్టరీ వెంకటేష్‌తో కలిసి హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో రాజకీయనేతలతో పాటుగా ఫిలిం సెలబ్రెటీలు కూడా పాల్గొన్నారు. అక్కడ మహేష్ - వెంకటేష్ క్లబ్బులో కార్డ్స్ ఆడుతున్న టేబుల్ దగ్గర కనిపించారు.
 
ఆ క్లబ్బు ఓపెనింగ్‌కి వెళ్ళిన మహేష్, వెంకటేష్ అలాగే మరికొంతమందితో కలిసి సరదాగా పేకాట ఆడిన పిక్ అది. అంతేకాని మహేష్ సీరియస్‌గా గేమ్ ఆడింది లేదని తర్వాత అర్థమైంది. కానీ ఆ క్లారిటీ వచ్చేలోపు మహేష్ వెంకటేష్‌లపై రకరకాల ట్రోల్స్ మీమ్స్ షేర్ అయిపోయాయి.
 
ఇక‌ వెంకటేష్ జిగర్ తాండా ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో, తాను వేరే ఇంపార్టెంట్ కార్యక్రమానికి హాజరవ్వాల్సి ఉందని చెప్పటం, వెంటనే కార్డ్స్ ఆడుతున్న పిక్స్ బయటకు రావటంతో, ఇదేనా ఆ ఇంపార్టెంట్ పని అని నెటిజెన్స్ కామెంట్స్ చేశారు. 
 
చివరికి మహేష్ భార్య నమ్రత సదరు ఈవెంట్‌కు సంబందించిన పిక్స్ షేర్ చేసి వెల్ కమ్ టూ దీవాలి సీజన్ అని.. ప్రీ సెలెబ్రేషన్స్ తరహాలో మెన్షన్ చేయటంతో, ఈ విషయంపై క్లారిటీ వచ్చింది. ఇక ఈ ఈవెంట్‌లో రామ్ చరణ్ కూడా పాల్గొన్న పిక్స్‌ను నమ్రత షేర్ చేసింది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఇటుకలపై జూనియర్ ఎన్టీఆర్ పేరు.. ఇల్లు అలా కట్టేస్తున్నాడు..