Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

వెంకటేష్ లాంచ్ చేసిన #90’s' ఏ మిడిల్ క్లాస్ బయోపిక్ టీజర్

Advertiesment
#90's A middle class  team with Venkatesh
, గురువారం, 2 నవంబరు 2023 (11:18 IST)
#90's A middle class team with Venkatesh
హీరో శివాజీ, వాసుకి ఆనంద్ సాయి ప్రధాన పాత్రలలో ఆదిత్య హాసన్ దర్శకత్వంలో రూపొందిన వెబ్ సిరిస్ '#90’s'. ‘ఏ మిడిల్ క్లాస్ బయోపిక్’ అనేది ట్యాగ్ లైన్. ప్రతి మధ్యతరగతి కుటుంబాన్ని ప్రతిబింబించే ఈ వెబ్ సిరిస్ ని ఎంఎన్ఓపీ ప్రొడక్షన్స్ బ్యానర్ పై రాజశేఖర్ మేడారం నిర్మిస్తున్నారు. నవీన్ మేడారం సమర్పిస్తున్నారు. హీరో విక్టరీ వెంకటేష్ '#90’s' టీజర్ ని ఈ రోజు లాంచ్ చేశారు.
 
90’s జ్ఞాపకాల్ని గుర్తు చేస్తూ టీవీలో 'మనోరంజని' కార్యక్రమాన్ని చూపిస్తూ టీజర్ ప్రారంభమైయింది. దాదాపు రెండు నిమిషాల నిడివి గల టీజర్ ఆద్యంతం నవ్వులు పూయించింది. శివాజీ ఓ మిడిల్ క్లాస్ ఫాదర్, స్కూల్ టీచర్. అతని భార్య పాత్రలో వాసుకి నటించారు. వీరి ముగ్గురు పిల్లలు. ఈ కుటుంబం చుట్టూ అల్లుకున్న సన్నివేశాలు అలనాటి అందమైన జ్ఞాపకాలతో పాటు మధ్యతరగతి కుటుంబాల అనందాలు, సరదాలు, సంఘర్షణలని ఎంతో అందంగా మనసుని హత్తుకునేలా చూపించాయి. శివాజీ, వాసుకి తమదైన నటనతో ఆకట్టుకున్నారు. పిల్లలు నటించిన నటులు కూడా చాలా హుషారుగా చక్కని నటన కనబరిచారు.
 
దర్శకుడు ఆదిత్య హాసన్ అందరికీ కనెక్ట్ అయ్యే కాన్సెప్ట్ ని తీసుకొని చాలా అద్భుతంగా ప్రజెంట్ చేశారని టీజర్ చూస్తే అర్ధమౌతుంది. వెబ్ సిరీస్ ప్రొడక్షన్స్ వాల్యూస్ టాప్ క్లాస్ లో వున్నాయి. విరాట పర్వం ఫేం సురేష్ బొబ్బిలి అందించిన నేపధ్య సంగీతం ప్లజంట్ గా వుంది. అజీమ్ మహ్మద్ ఫోటోగ్రఫీ చాలా లైవ్లీగా వుంది.  పలు సక్సెస్ ఫుల్ చిత్రాలకు పని చేసిన గాంధీ నడికుడికర్ ఆర్ట్ డైరెక్టర్ పని చేస్తున్నారు. ఆర్ట్ వర్క్ బ్రిలియంట్ గా వుంది. ఈ వెబ్ సిరీస్ కి ఎడిటర్ శ్రీధర్.
#90's ఈ సంక్రాంతికి ఈటీవీ విన్ యాప్ ద్వారా ప్రేక్షకుల ముందుకు రానుంది.    

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

క్లీంకారతో చిరంజీవి దంపతులు-ఫోటో వైరల్