Webdunia - Bharat's app for daily news and videos

Install App

హీరో ప్రభాస్ - శ్యామలాదేవికి సంబంధమే లేదు : బాంబు పేల్చిన వేణుస్వామి

వరుణ్
బుధవారం, 10 ఏప్రియల్ 2024 (11:34 IST)
prabhas
ప్రముఖ వివాదాస్పద జ్యోతిష్యుడు వేణుస్వామి తాజాగా మరో బాంబు పేల్చారు. హీరో ప్రభాస్‌కు ఆయన పెద్దమ్మ శ్యామలాదేవికి అస్సలు సంబంధమే లేదని వ్యాఖ్యానించారు. ఈ విషయం ప్రభాస్ జాతకరీత్యా తాను గ్రహించినట్టు చెప్పారు. 
 
ప్రస్తుతం ఈ అంశం చర్చనీయాంశంగా మారింది. చాలామంది వారు బంధువులేనని అంటారని కానీ, అసలు నిజం మాత్రం తనకు మాత్రమే తెలుసన్నారు. తానైతే శ్యామలాదేవి కంటే ప్రభాస్ తల్లికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తానని చెబుతూనే వారి వ్యక్తిగత విషయాల జోలికిపోవడం లేదని అన్నారు. 
 
ప్రభాస్ జాతకం ఒకసారి వేరేవారి ద్వారా తన వద్దకు వచ్చిందన్నారు. కానీ అది ఎవరి ద్వారా వచ్చిందో మాత్రం చెప్పబోనని తెలిపారు. కృష్ణంరాజు గవర్నర్ అవుతారా అని అడిగేందుకు ఒకసారి శ్యామలాదేవి కూడా తన వద్దకు వచ్చారని వేణుస్వామి వెల్లడించారు. 
 
అయితే, అపుడు ఆమె ప్రశ్నకు తాను సమాధానం చెప్పానా లేదా అన్నది మా ఇద్దరికి మాత్రమే తెలుసన్నారు. కాగా, వివాదాస్పద జ్యోతిష్యుడిగా గుర్తింపుపొందిన వేణుస్వామి... ఇటీవల ఆయన అంచనాలు తప్పుతున్నాయి. 
 
తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్ మరోమారు గెలుస్తారని, ప్రభాస్ సినిమా సలార్ ఫ్లాప్ అవుతుందని చెప్పి ఆయనే ఫ్లాప్ అయ్యారు. ఆయన జాతకాలు తారుమారు కావడంతో వేణుస్వామి చెప్పే జాతకాలపై ప్రజలకు పూర్తిగా నమ్మకం పోయింది. దీంతో ఏదో ఒక సంచలన వార్తను బహిర్గతం చేస్తూ ఇలా వార్తలకెక్కుతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పోలవరం ప్రాజెక్టుకు రూ.5936 కోట్లు.. ఈ బడ్జెట్‌లో ఇంతే...

Union Budget 2025-26: కేంద్ర బడ్జెట్‌పై ఏపీ సీఎం చంద్రబాబు ఏమన్నారంటే?

గంగలూరు అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్.. 8 మంది మావోలు హతం!

ఏపీలో ఇద్దరికే సూపర్ ఫ్యాన్ ఫాలోయింగ్, వాళ్లెవరంటే?: కేతిరెడ్డి వెంకట్రామి రెడ్డి

ఆదాయపన్ను విషయంలో కేంద్రం ఎందుకు దిగివచ్చింది?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆటలో అరటి పండు కాదు ఆరోగ్యానికి అరటి పండు

ఆత్రేయపురం పూతరేకులను తినడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలేంటో తెలుసా?

ఇబ్బంది పెట్టే మైగ్రేన్‌ను వదిలించుకోవడానికి సింపుల్ చిట్కాలు

ఖాళీ కడుపుతో వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు

వళ్లు వేడిబడింది, జ్వరం వచ్చిందేమో? ఎంత ఉష్ణోగ్రత వుంటే జ్వరం?

తర్వాతి కథనం
Show comments