Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

గతంలో ఓ అమ్మాయిని ప్రేమించా... అది వర్కౌట్ కాలేదు : విజయ్ దేవరకొండ

vijay devarakonda

ఠాగూర్

, ఆదివారం, 31 మార్చి 2024 (16:02 IST)
తాను గతంలో ఓ అమ్మాయిని ప్రేమించానని కానీ అది వర్కౌట్ కాలేదని హీరో విజయ్ దేవరకొండ అన్నారు. తాను నటించిన తాజా చిత్రం ఫ్యామిలీ స్టార్. ఏప్రిల్ 5వ తేదీన విడుదలకానుంది. ఈ చిత్రం ప్రచార కార్యక్రమాల్లో భాగంగా ఆయన పలు మీడియా సంస్థలకు ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఒకే సమయంలో ఇద్దరు వ్యక్తులతో రిలేషన్‌షిప్‌లో ఉండొచ్చా..? అనే ప్రశ్న విజయ్ దేవరకొండకు ఎదురైంది. ఈ ప్రశ్నకు ఆయన చాలా తెలివిగా, చాకచక్యంగా సమాధానమిచ్చారు. 
 
'ప్రతి ఒక్కరూ ఏదో ఒక సమయంలో రిలేషన్‌షిప్‌లో ఉంటారు. ఉదాహరణకు నా స్నేహితులు చాలామంది రిలేషన్‌షిప్‌లో ఉన్నారు. తమ భాగస్వామిని ఎంతగానో ప్రేమించారు. కొన్ని అనివార్య కారణాల వల్ల ఆ బంధం ముందుకు సాగలేదు. దానివల్ల కొన్నేళ్లపాటు బాధ అనుభవించారు. ఆ తర్వాత మరొకరిని కలిశారు. ప్రేమలో పడ్డారు. కాబట్టి, వేర్వేరు వ్యక్తులతో ప్రేమలో ఉండటం సహజమే. కానీ, ఒకే సమయంలో ఇద్దరితో ప్రేమలో ఉండటాన్ని  ప్రోత్సహించను. మహిళలపై నాకు అమితమైన గౌరవం ఉంది. ఒకరితో ప్రేమలో ఉన్నప్పుడు వేరే అమ్మాయిని నా జీవితంలోకి ఆహ్వానించను. ప్రేమించిన అమ్మాయినే సర్వస్వంగా భావిస్తా. గతంలో నేనొకరిని ప్రేమించా. అది వర్కౌట్‌ కాలేదు' అని చెప్పారు.
 
కొత్త దర్శకులతో కలిసి వర్క్‌ చేస్తారా..? అని ప్రశ్నించగా.. 'కొత్త దర్శకులతో వర్క్‌ చేయాలని నేను అనుకోవడం లేదు. ఎందుకంటే, అనుభవం లేకుండా బడ్జెట్‌, మేకింగ్‌ను మేనేజ్‌ చేయడం క్లిష్టమవుతుంది. ఒక్క సినిమా అయినా చేసిన దర్శకుడితో వర్క్ చేస్తా. సినిమా మేకింగ్‌పై అవగాహన ఉంటుంది. అతడి గత చిత్రం హిట్‌, ఫ్లాప్‌ అనేది చూడను' అని బదులిచ్చారు. అల్లు అర్జున్‌ డ్యాన్స్‌ అంటే తనకెంతో ఇష్టమన్నారు. 'డాడీ'లో బన్నీ డ్యాన్స్‌ చూసి అబ్బురపడినట్టు చెప్పారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

శ్రీ చైతన్య బ్రాండ్ అంబాసిడర్‌గా గుంటూరు కారం బామ్మ శ్రీలీల