Webdunia - Bharat's app for daily news and videos

Install App

శేఖ‌ర్ క‌మ్ముల ద‌ర్శ‌కుడిగా నిర్మాణ రంగంలో అడుగుపెడుతున్న ఏసియ‌న్ గ్రూప్

యాభై సంవ‌త్స‌రాలుగా 600 సినిమాల‌కు ఫైనాన్స్ అందించి ప్ర‌స్తుతం డిస్ట్రిబ్యూష‌న్‌, ఎగ్జిబిష‌న్ రంగాల‌లో అగ్ర‌గామి సంస్థ‌గా ఎదిగిన ఏషియ‌న్ గ్రూప్ ఇప్పుడు సినిమా నిర్మాణ రంగంలో అడుగుపెడుతోంది. ప్రెస్టీజియ‌స్ ద‌ర్శ‌కుడు శేఖ‌ర్ క‌మ్ముల ద‌ర్శ‌క‌త్వంలో రూపొ

Webdunia
సోమవారం, 17 సెప్టెంబరు 2018 (18:35 IST)
యాభై సంవ‌త్స‌రాలుగా 600 సినిమాల‌కు ఫైనాన్స్ అందించి ప్ర‌స్తుతం డిస్ట్రిబ్యూష‌న్‌, ఎగ్జిబిష‌న్ రంగాల‌లో అగ్ర‌గామి సంస్థ‌గా ఎదిగిన ఏషియ‌న్ గ్రూప్ ఇప్పుడు సినిమా నిర్మాణ రంగంలో అడుగుపెడుతోంది. ప్రెస్టీజియ‌స్ ద‌ర్శ‌కుడు శేఖ‌ర్ క‌మ్ముల ద‌ర్శ‌క‌త్వంలో రూపొందే ల‌వ్ స్టోరీకి సంబంధించిన ప్రీ-ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు పూర్తి అయ్యాయి. 
 
మ‌ల్టీప్లెక్స్ రంగంలో ఒక రివ‌ల్యూష‌న్‌ సృష్టించిన ఏషియ‌న్ గ్రూప్ తెలుగు సినిమా ప‌రిశ్ర‌మ‌లో ప్ర‌ధాన భాగంగా ఎదిగింది. సినిమాను ప్రేక్ష‌కుల‌కు చేరువ‌చేసే డిస్ట్రిబ్యూష‌న్‌, ఎగ్జిబిష‌న్ రంగాల‌లో అగ్ర‌గామిగా ఎదిగిన ఏషియ‌న్ గ్రూప్ ఇప్పుడు నిర్మాణ రంగంలో తన ప్ర‌యాణాన్ని మొద‌లుపెట్టింది. ఆ ప్ర‌యాణంలో తొలి అడుగు శేఖ‌ర్ కమ్ముల‌తో క‌ల‌సి  వేస్తుంది. నిర్మాతలుగా నారాయణ దాస్ నారంగ్, పి. రామ్మోహన్ రావు(FDC Chairman) వ్యవహరించనున్నారు. 
 
బ్లాక్ బ‌స్ట‌ర్ మూవీ ఫిదా త‌ర్వాత శేఖర్ క‌మ్మ‌ల చేయ‌బోయే ప్రాజెక్ట్ మీద ఇండ్ర‌స్టీలోనూ, ప్రేక్ష‌కులోనూ ఆస‌క్తి నెల‌కొంది. కంటెంట్‌ని త‌ప్ప క్రేజ్‌ని న‌మ్ముకొని శేఖ‌ర్ కమ్ముల నుండి రాబోతున్న ఈ ల‌వ్ స్టోరీకి సంబంధించిన మిగ‌తా వివ‌రాలు త్వ‌ర‌లోనే ప్ర‌క‌టించ‌నుంది నిర్మాణ సంస్థ‌. అమిగోస్ క్రియేషన్స్ స‌మ‌ర్ప‌ణ‌లో నిర్మించ‌బోయే ఈ ప్రేమ క‌థ‌కు 
నిర్మాత‌లు : నారాయ‌ణ దాస్ నారంగ్, పి. రామ్మోహ‌న్. కో-ప్రొడ్యూస‌ర్-విజ‌య్ భాస్క‌ర్‌.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

నన్ను వేశ్యగా మారుస్తానన్నాడు, అందుకే చంపేసా: భర్త హత్యపై భార్య

గూగుల్ మ్యాప్‌పై గుడ్డి నమ్మకం- ఇటలీలో ఎగురుతూ కిందపడిన బీఎండబ్ల్యూ కారు (video)

జగన్‌తో విబేధాలు అక్కడ నుంచే మొదలు.. రఘు రామ కృష్ణంరాజు

తిరుమలలో షార్ట్ సర్క్యూట్‌తో అగ్నికి ఆహుతి అయిన కారు (video)

తండ్రి చనిపోయినా తల్లి చదివిస్తోంది.. చిన్నారి కంటతడి.. హరీష్ రావు భావోద్వేగం (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చెరుకు రసం ఆరోగ్య ప్రయోజనాలు ఇవే

లెమన్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

కార్డియోమెటబాలిక్ ఆరోగ్యం, బరువు నిర్వహణకు బాదం పప్పులు

మెదడు పనితీరును పెంచే ఫుడ్

వెర్టిగో గురించి ఈ సోషల్ మీడియా అధ్యయనం కీలక భావనలను వెల్లడిస్తుంది!

తర్వాతి కథనం
Show comments