Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఓ ఆత్మ ప్రేమకథతో ఆశిష్, వైష్ణవి చైతన్య చిత్రం లవ్ మీ.. ఇఫ్ యు డేర్

డీవీ
సోమవారం, 6 మే 2024 (17:19 IST)
Ashish Vaishnavi Chaitanya
మనం వద్దని చెప్పిన పనిచేస్తే వారిని స్టుపిడ్ అని తిడుతుంటాం.. మరి మన గుండె మన కంట్రోల్ లేక మరొకరి వశం అవుతుంటే ఏమంటాం.. స్టుపిడ్ హార్ట్ అంటాం. ఇప్పుడు ఓ అందమైన అమ్మాయి.. తన గుండెను కూడా అలాగే తిడుతుంది. అందుకు కారణం.. నచ్చిన అబ్బాయి కనపడగానే, అమ్మాయి గుండె లయ తప్పుతోంది మరి. అసలు ఇంతకీ ఆ అమ్మాయి అంతలా అబ్బాయిన ఎందుకు ఇష్టపడిందనే విషయం తెలియాలంటే ‘లవ్ మీ.. ఇఫ్ యు డేర్’ సినిమా చూడాల్సిందేనంటున్నారు మేకర్స్.
 
టాలెంటెడ్ యాక్టర్స్ ఆశిష్, వైష్ణవి చైతన్య హీరో హీరోయిన్లుగా శిరీష్ సమర్పణలో దిల్ రాజు ప్రొడక్షన్స్ బ్యానర్ మీద హర్షిత్ రెడ్డి, హన్షిత, నాగ మల్లిడి నిర్మించిన చిత్రం ‘లవ్ మీ’. ఈ చిత్రానికి అరుణ్ భీమవరపు దర్శకత్వాన్ని వహించారు. ‘ఇఫ్ యు డేర్’ అనేది ఉప శీర్షిక. . ఈ హారర్ థ్రిల్లర్‌ను ప్రపంచ వ్యాప్తంగా మే 25న గ్రాండ్ రిలీజ్ చేయబోతున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్, పాటలకు ప్రేక్షకుల నుంచి చాలా మంచి స్పందన వచ్చింది.
 
రానున్న వేసవిలో వెన్నులో వణుకు పుట్టించేలా ఓ ఆత్మ ప్రేమకథతో బ్లాక్ బస్టర్ సాధిస్తామని దర్శక, నిర్మాతలు కాన్ఫిడెంట్‌గా ఉన్నారు. ఈ క్రమంలో ప్రమోషన్స్‌లో వేగాన్ని పెంచుతున్నారు. ఆశిష్, వైష్ణవి చైతన్య హీరో హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రానికి స్టార్ సినిమాటోగ్రాఫర్ పి.సి.శ్రీరామ్ సినిమాటోగ్రఫీ అందించగా, అవినాష్ కొల్ల ఆర్ట్, ఆస్కార్ విన్నింగ్ మ్యూజిక్ డైరెక్టర్ ఎం.ఎం.కీరవాణి సంగీతాన్ని అందించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

హైదరాబాద్‌లో దంచికొట్టిన వర్షం ... పిడుగుపాటుకు ఇద్దరు మృతి (Video)

వివేకా కుమార్తె సునీతను ఏమైనా చేస్తారనే భయం ఉంది : వైఎస్ షర్మిల

బోయ్ ఫ్రెండ్ కౌగిలించుకోలేదని 14 అంతస్తుల కాలేజీ భవనం పైనుంచి దూకేసిన యువతి

అమరావతికి శుభవార్త చెప్పిన ప్రపంచ బ్యాంక్ - తొలి విడతగా రూ.3535 కోట్లు రిలీజ్

జాతీయ ఉపాధి హామీ పథకం లబ్దిదారుల జాబితాలో షమీ సోదరి పేరు!!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

కిడ్నీలు వైఫల్యానికి కారణాలు ఏమిటి?

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

కిడ్నీ స్టోన్స్ తగ్గించేందుకు సింపుల్ టిప్స్

వారానికి మూడు రోజుల పాటు కొబ్బరి నీళ్లు తాగితే?

తర్వాతి కథనం
Show comments