Webdunia - Bharat's app for daily news and videos

Install App

సాహోలో పవర్‌ఫుల్ క్యారెక్టర్లో అరుణ్ విజయ్... పోస్టర్‌కి సూపర్బ్ రెస్పాన్స్...

Webdunia
బుధవారం, 7 ఆగస్టు 2019 (21:53 IST)
సాహో విడుదలకు రెడీ అయ్యేందుకు సిద్ధమౌతోన్న సందర్భంలో.... సినిమాలో నటించిన ఒక్కో పాత్రను పరిచయం చేస్తున్నారు. ఇప్పటికే ప్రభాస్, శ్రద్ధా కపూర్ లుక్స్‌కి అద్భుతమైన స్పందన వచ్చిన సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు నటుడు అరుణ్ విజయ్ లుక్‌ని విడుదల చేశారు. తమిళంలో పలు సూపర్ హిట్ చిత్రాల్లో... విభిన్నమైన క్యారెక్టర్స్ చేస్తూ.. మంచి పేరు తెచ్చుకున్న అరుణ్ విజయ్ సాహోలో అద్భుతమైన పాత్రతో మెప్పించబోతున్నాడు. 
 
భారీ ఖర్చుతో తెరకెక్కిస్తున్న ఈ యాక్షన్ ప్యాక్డ్ సినిమాలోని ప్రతి క్యారెక్టర్కి ఇంపార్టెన్స్ ఉంది. అలాగే అరుణ్ విజయ్ పాత్ర సినిమాలో చాలా కీలకం. ఈ పాత్రను ప్రత్యేకంగా డిజైన్ చేశారు.
"Blood doesn't need bloody invitation" అనే క్యాప్షన్‌ని బట్టే ఈ క్యారెక్టర్ ఎంత పవర్‌ఫుల్‌గా వుండనుందో అర్థం చేసుకోవచ్చు. 
 
యంగ్ రెబల్ స్టార్ ప్ర‌భాస్, బాలీవుడ్ బ్యూటీ శ్ర‌ద్ధా క‌పూర్ జంట‌గా యు.వీ క్రియేష‌న్స్ ప‌తాకంపై వంశీ, ప్ర‌మోద్, విక్ర‌మ్‌లు ఎంతో ప్ర‌తిష్ఠాత్మ‌కంగా నిర్మిస్తున్న చిత్రం సాహో. యంగ్ డైరెక్ట‌ర్ సుజిత్ ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నారు. అత్యంత భారీ బ‌డ్జెట్‌తో హై స్టాండ‌ర్డ్స్ టెక్నాల‌జీతో తెరెకెక్కుతుంది. ఈ చిత్రం ఆగ‌ష్టు 30న ప్ర‌పంచ వ్యాప్తంగా విడుద‌ల చేస్తున్నారు. 
 
బాహుబలి లాంటి చిత్రం త‌రువాత వ‌స్తున్న చిత్రం కావ‌టంతో రెబ‌ల్‌స్టార్ ఫ్యాన్స్‌తో పాటు ఇండియ‌న్ సినిమా ల‌వ‌ర్స్ అంద‌రూ ఈ సినిమాపై భారీ అంచ‌నాలు పెట్టుకున్నారు. దీంతో మేక‌ర్స్ ఎక్క‌డా చిన్న విష‌యంలో కూడా కాంప్ర‌మైజ్ కాకుండా ఆడియ‌న్స్‌కి పూర్తి వినోదాన్ని క్లారిటి ఆఫ్ క్వాలిటితో అందించాల‌ని నిర్ణ‌యించుకున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకం.. ఏపీ సర్కారు కీలక నిర్ణయం

కూటమి ప్రభుత్వానికి వడ్డీతో సహా చెల్లిస్తాం: వైసిపి మాజీ మంత్రి రోజా

YS Jagan: జగన్ పుట్టినరోజు బ్యానర్‌లో అల్లు అర్జున్ ఫోటో.. (వీడియో)

రీల్స్ కోసం.. శునకాన్ని ఆటోపై ఎక్కించుకుని తిరిగాడు.. (Video)

Andhra Pradesh: ఏపీలో భూప్రకంపనలు.. రెండు సెకన్ల పాటు కంపించింది.. పరుగులు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శీతాకాలంలో తినాల్సిన ఆహార పదార్థాలు ఏంటి?

ప్రతిష్టాత్మక IIT మద్రాస్ CSR అవార్డు 2024 గెలుచుకున్న హెర్బాలైఫ్ ఇండియా

పొడియాట్రిక్ పాదాలు-చీలమండ చికిత్సను మెరుగుపరచడానికి ఇసావోట్ అత్యాధునిక ఓ-స్కాన్ ఎంఆర్ఐ మెషీన్‌

చేదుగా వుండే కాకరకాయ ఆరోగ్యానికి అద్భుతమైన మేలు

ఉదయం పూట ఖాళీ కడుపుతో తీసుకోదగిన ఆహారం, ఏంటి?

తర్వాతి కథనం
Show comments