ఘనంగా యాక్షన్ కింగ్ అర్జున్ కుమార్తె ఐశ్వర్య అర్జున్ నిశ్చితార్థం

Webdunia
ఆదివారం, 29 అక్టోబరు 2023 (14:54 IST)
యాక్షన్ కింగ్ అర్జున్ సర్జా కుమార్తె ఐశ్వర్య అర్జున్ నిశ్చితార్థం.. కోలీవుడ్ సీనియర్ నటుడు, దర్శకుడైన తంబి రామయ్య కుమారుడు, యంగ్ హీరో ఉమాపతి రామయ్యతో శుక్రవారం ఘనంగా జరిగింది. చెన్నైలో అర్జున్ నిర్మించిన హనుమాన్ టెంపుల్‌లో ఈ నిశ్చితార్థ కార్యక్రమాన్ని ఇరు కుటుంబాలకు చెందిన బంధువుల సమక్షంలో ఘనంగా నిర్వహించారు. 
 
నిశ్చితార్థం అనంతరం ఐశ్వర్య, ఉమాపతిల వివాహం 2024 సంవత్సరం మార్చి లేదా ఏప్రిల్‌లో ఉంటుందని అర్జున్ సర్జా తెలిపారు. ఈ నిశ్చితార్థానికి ఇరు కుటుంబాలకు చెందిన ఫ్యామిలీ మెంబర్స్, బంధువులను మాత్రమే పిలిచామని.. పెళ్లికి మాత్రం అందరినీ ఆహ్వానిస్తామని ఈ సందర్భంగా అర్జున్ సర్జా మీడియాకు తెలియజేశారు.
 
ఈ నిశ్చితార్థ వేడుకలో ఉమాపతి రామయ్య డ్రస్‌ని ముంబైకి చెందిన మనీష్ మల్హోత్రా డిజైన్ చేయగా.. ఐశ్వర్య అర్జున్ ధరించిన డ్రస్‌ను జయంతి రెడ్డి డిజైన్ చేశారు. 5 క్యారెట్ బర్మీస్ రూబీ విత్ డైమండ్ అండ్ వైట్ గోల్డ్‌తో చేసిన రింగ్స్‌ని ఐశ్వర్య అర్జున్ ధరించగా.. ఉమాపతి కూడా గోల్డ్ అండ్ డైమండ్ రూబీ ధరించారు. అర్జున్ నిర్మించిన హనుమాన్ టెంపుల్‌లోని రాములువారి విగ్రహం ముందు ఐశ్వర్య-ఉమాపతి నిశ్చితార్థపు ఉంగరాలు మార్చుకున్నట్లుగా అర్జున్ సర్జా చెప్పుకొచ్చారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

వైకుంఠ ద్వార దర్శనం.. ఆ మూడు తేదీలకు ఎలక్ట్రానిక్ డిప్ బుకింగ్స్

Pawan Kalyan: ఏపీలో వచ్చే 15 ఏళ్లు ఎన్డీఏ ప్రభుత్వమే అధికారంలో వుంటుంది.. పవన్

ఎస్వీయూ క్యాంపస్‌లో చిరుతపులి.. కోళ్లపై దాడి.. ఉద్యోగులు, విద్యార్థుల్లో భయం భయం

కోనసీమ కొబ్బరి రైతుల సమస్యల్ని 45 రోజుల్లో పరిష్కరిస్తాం.. పవన్ కల్యాణ్

జగన్‌కు టీడీపీ ఎమ్మెల్సీ సవాల్... నిరూపిస్తే పదవికి రాజీనామా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్ వున్నవారు తెలుసుకోవాల్సిన విషయాలు

భారతదేశంలో ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ బాధిత రోగులలో జీవించే అవకాశాలు కేవలం 3 శాతం మాత్రమే.. కానీ...

పెద్దపేగు కేన్సర్‌కు చెక్ పెట్టే తోక మిరియాలు

నెక్స్ట్-జెన్ AIతో జనరల్ ఇమేజింగ్‌: R20 అల్ట్రాసౌండ్ సిస్టమ్‌ను ప్రారంభించిన శామ్‌సంగ్

ఈ అనారోగ్య సమస్యలున్నవారు చిలకడ దుంపలు తినకూడదు

తర్వాతి కథనం
Show comments