Webdunia - Bharat's app for daily news and videos

Install App

అర్జున్ రెడ్డి సెంటిమెంట్ ఈసారి వ‌ర్క‌వుట్ అవుతుందా..?

ఒక్కొక్క‌రికి ఒక్కొ సెంటిమెంట్ ఉంటుంది. అదే.. సినిమావాళ్ల‌కు అయితే... ఈ సెంటిమెంట్ కాస్త ఎక్కువుగానే ఉంటుంది. ఇంత‌కీ విష‌యం ఏంటంటే.. అర్జున్ రెడ్డి సినిమా ఎంత‌టి సంచ‌ల‌నం సృష్టించిందో తెలిసిందే. ఈ సిన

Webdunia
శనివారం, 28 జులై 2018 (20:27 IST)
ఒక్కొక్క‌రికి ఒక్కొ సెంటిమెంట్ ఉంటుంది. అదే.. సినిమావాళ్ల‌కు అయితే... ఈ సెంటిమెంట్ కాస్త ఎక్కువుగానే ఉంటుంది. ఇంత‌కీ విష‌యం ఏంటంటే.. అర్జున్ రెడ్డి సినిమా ఎంత‌టి సంచ‌ల‌నం సృష్టించిందో తెలిసిందే. ఈ సినిమా ట్రైల‌ర్ ను నేచుర‌ల్ స్టార్ నాని రిలీజ్ చేసారు. ఇప్పుడు త‌మ సినిమా కూడా సెన్సేష‌న‌ల్ హిట్ సాధించాల‌నే ఉద్దేశ్యంతో గూఢ‌చారి సినిమా ట్రైల‌ర్‌ను కూడా నానితో రిలీజ్ చేయించారు చిత్ర‌యూనిట్. అడివి శేష్ న‌టించిన గూఢ‌చారి చిత్రానికి నూత‌న ద‌ర్శ‌కుడు శ‌శికిర‌ణ్ తిక్క ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. 
 
థ్రిల్ల‌ర్ మూవీగా రూపొందిన ఈ సినిమాని ఆగ‌ష్టు 3న రిలీజ్ చేస్తున్నారు. ఇందులో నాగార్జున మేన‌కోడ‌లు సుప్రియ దాదాపు 20 సంవ‌త్స‌రాల త‌ర్వాత రీ ఎంట్రీ ఇస్తుండ‌డం విశేషం. టీజ‌ర్ & ట్రైల‌ర్ చాలా బాగుండ‌డంతో పాజిటివ్ టాక్ ఉంది. దీనికి క్ష‌ణం సినిమాకి అందించిన‌ట్టే అడివి శేష్ క‌థ అందించ‌డం విశేషం. పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ ఈ సినిమాని నిర్మించింది. ఈ సినిమా బాగా న‌చ్చ‌డంతో మ‌రో నిర్మాత అనిల్ సుంక‌ర ఈ సినిమా రైట్స్ ద‌క్కించుకున్నారు. మ‌రి.. అర్జున్ రెడ్డి సెంటిమెంట్ వ‌ర్క‌వుట్ అవుతుందా..? లేదా అనేది తెలియాలంటే ఆగ‌ష్టు 3 వ‌ర‌కు ఆగాల్సిందే.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

చైనా ఆయుధ వ్యవస్థలను ఏమార్చి పాక్‍లో లక్ష్యాలపై దాడులు చేసిన భారత్!!

బీజాపూర్ జిల్లాలో భారీ ఎన్‌కౌంటర్ - 31 మంది మావోలు హతం

Hyderabad: హాస్టల్ గదిలో ఉరేసుకున్న డిగ్రీ విద్యార్థి.. కారణం ఏంటో?

కాళ్ళబేరానికి వచ్చిన పాకిస్థాన్ : సింధు జలాల రద్దు పునఃసమీక్షించండంటూ విజ్ఞప్తి

పాకిస్తాన్ 2 ముక్కలు, స్వతంత్ర దేశంగా బలూచిస్తాన్ ప్రకటన

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పైల్స్ తగ్గేందుకు సింపుల్ టిప్స్

పసుపు, మిరియాల పొడిని కలిపిన గోల్డెన్ మిల్క్ తాగితే?

రోజూ ఒక చెంచా తేనె సేవిస్తే ఏమవుతుంది?

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments