Webdunia - Bharat's app for daily news and videos

Install App

'కేక' పెట్టిస్తున్న అర్జున్ రెడ్డి... తొలిరోజు కలెక్షన్స్ రూ. 2,47,00,000

ముద్దు సీన్ పోస్టర్లను బస్సులు, హోర్డింగులపై అతికించడమే కాకుండా సీనియర్ నాయకుడు వీహెచ్ ను సైతం అంకుల్... చిల్ అంటూ సెటైర్లు వేసిన అర్జున్ రెడ్డి మూవీ టీం తాము అనుకున్నది సాధించేసింది. అటు సినీ ఇండస్ట్రీలోని సెలబ్రిటీలను, ఇటు ఎప్పుడూ ట్విట్టర్ ముందు క

Webdunia
శనివారం, 26 ఆగస్టు 2017 (20:09 IST)
ముద్దు సీన్ పోస్టర్లను బస్సులు, హోర్డింగులపై అతికించడమే కాకుండా సీనియర్ నాయకుడు వీహెచ్ ను సైతం అంకుల్... చిల్ అంటూ సెటైర్లు వేసిన అర్జున్ రెడ్డి మూవీ టీం తాము అనుకున్నది సాధించేసింది. అటు సినీ ఇండస్ట్రీలోని సెలబ్రిటీలను, ఇటు ఎప్పుడూ ట్విట్టర్ ముందు కూర్చుని తన అభిప్రాయాన్ని పోస్ట్ చేసే వర్మని బాగా ఇంప్రెస్ చేసేశారు. ప్రేక్షకులు కూడా ఈ చిత్రానికి బ్రహ్మరథం పడుతున్నారు. 
 
ముద్దు సీన్ పైన కొందరు ఘాటుగా స్పందించారు కానీ... ప్రేక్షకులు మాత్రం పెద్దగా పట్టించుకున్నట్లు లేరు. చిత్రాన్ని మామూలుగా కాదు... ఓ రేంజిలో చూస్తున్నారంటే నమ్మండి. పిచ్చపిచ్చగా చూసేస్తున్నారు. తొలి రోజే ఈ చిత్రం రూ. 2.47 కోట్లను వసూలు చేసిందంటే ఇక దాని స్టామినా వేరే చెప్పాలా? సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో విజయ్ దేవరకొండ కథానాయకుడిగా రూపొందిన 'అర్జున్ రెడ్డి'లో షాలిని పాండే కథానాయికగా నటించింది. 
 
వసూళ్ల లెక్క చూస్తే  నైజాంలో రూ. 1.22 కోట్లు, సీడెడ్లో రూ. 33 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 21 లక్షలు, తూ.గోలో రూ.12 లక్షలు, ప.గోలో రూ.9 లక్షలు, కృష్ణాలో రూ. 25 లక్షలు, గుంటూరులో రూ.20 లక్షలు, నెల్లూరులో రూ. 5 లక్షలను రాబట్టి సన్సేషన్ క్రియేట్ చేసింది. మొత్తమ్మీద చిన్న సినిమా ఈ స్థాయిలో దూసుకుపోతుండటంపై సినీ వర్గాలు ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నాయి.

సంబంధిత వార్తలు

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments