Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

'తాతయ్య... చిల్' అన్న 'అర్జున్ రెడ్డి' టీంకు 'జిల్ జిల్ ఝలక్'(వీడియో)

విజయ్‌ దేవరకొండ, షాలిని పాండే హీరోయిన్‌గా నటిస్తున్న తాజాగా చిత్రం 'అర్జున్‌ రెడ్డి'. ఈ చిత్రాన్ని భద్రకాళి పిక్చర్స్ పతాకంపై నిర్మిస్తున్నారు. త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్న 'అర్జున్ రెడ్డి' సినిమా పోస్టర్ ఇప్పటికే విమర్శలు వచ్చాయి.

Advertiesment
Arjun Reddy Movie Talk
, బుధవారం, 23 ఆగస్టు 2017 (21:18 IST)
విజయ్‌ దేవరకొండ, షాలిని పాండే హీరోయిన్‌గా నటిస్తున్న తాజాగా చిత్రం 'అర్జున్‌ రెడ్డి'. ఈ చిత్రాన్ని భద్రకాళి పిక్చర్స్ పతాకంపై నిర్మిస్తున్నారు. త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్న 'అర్జున్ రెడ్డి' సినిమా పోస్టర్ ఇప్పటికే విమర్శలు వచ్చాయి. 
 
అసభ్యకరమైన పోస్టర్‌ను చిత్రీకరించిన 'అర్జున్ రెడ్డి' చిత్ర నిర్మాత, దర్శకుడు, హీరో, హీరోయిన్లపై తగిన చర్యలు తీసుకోవాలంటూ హైదరాబాద్ నగర పోలీసులకు కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. 
 
దీంతో ఈ చిత్రం విడుదలకు ముందే కావాల్సినంత ప్రచారం సొంతం చేసుకుంది. ముఖ్యంగా, సినిమాలోని లిప్‌లాక్ ముద్దుల దృశ్యాల పోస్టర్లపై సంచలన వ్యాఖ్యలు, రాంగోపాల్ వర్మ ట్వీట్ల సందడి, వీహెచ్ ఆగ్రహం వ్యక్తం చేయడం.. ఈ సినిమాకు ఇప్పటికే అద్భుతమైన ప్రచారం వచ్చింది.
 
ఈ నేపథ్యంలో ఈ సినిమాలోని లిప్ లాక్‌లకు సంబంధించిన పోస్టర్లను ఉపసంహరించుకున్నట్టు దర్శకుడు సందీప్‌ రెడ్డి వంగా, నిర్మాత ప్రణయ్‌ రెడ్డి వంగా తెలిపారు. మహిళలను గౌరవిస్తూ ఏపీ, తెలంగాణాల్లో ఏర్పాటు చేసిన ఈ సినిమా పోస్టర్లను తీసేసినట్టు తెలిపారు. ఈ సినిమా ఈ నెల 25న ప్రేక్షకుల ముందుకు రానుంది. వీడియో చూడండి...

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కుమార్తె ఆరాధ్యతో కలిసి ఐశ్వర్య రాయ్ తెల్లటి దుస్తులలో...?(వీడియో)