Webdunia - Bharat's app for daily news and videos

Install App

'అర‌వింద స‌మేత' టీమ్‌ని టెన్ష‌న్ పెడుతున్న విజ‌య్ దేవరకొండ

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ - మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ కాంబినేష‌న్లో రూపొందుతోన్న భారీ చిత్రం అర‌వింద స‌మేత‌. వీర‌ రాఘ‌వ అనేది ట్యాగ్ లైన్. ఈ సినిమాని ద‌స‌రా కానుక‌గా రిలీజ్ చేయాల‌నుకున్నారు. అయితే.. స‌డ‌న్‌గా హ‌రికృష్ణ చ‌నిపోవ‌డంతో షూటింగ్‌కి బ్రేక్

Webdunia
మంగళవారం, 4 సెప్టెంబరు 2018 (14:49 IST)
యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ - మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ కాంబినేష‌న్లో రూపొందుతోన్న భారీ చిత్రం అర‌వింద స‌మేత‌. వీర‌ రాఘ‌వ అనేది ట్యాగ్ లైన్. ఈ సినిమాని ద‌స‌రా కానుక‌గా రిలీజ్ చేయాల‌నుకున్నారు. అయితే.. స‌డ‌న్‌గా హ‌రికృష్ణ చ‌నిపోవ‌డంతో షూటింగ్‌కి బ్రేక్ ప‌డింది. దీంతో అర‌వింద స‌మేత ద‌స‌రాకి రావ‌డం క‌ష్ట‌మే అంటూ ప్ర‌చారం మొద‌లైంది. కానీ.. ఎన్టీఆర్ షూటింగ్‌లో జాయిన్ అవ్వ‌డంతో ఇక ద‌స‌రాకి రావ‌డం ఖాయం అని తెలుస్తుంది. 
 
ఇక అస‌లు విష‌యానికి వ‌స్తే... గీత గోవిందం సినిమాతో బ్లాక్‌బ‌ష్ట‌ర్ సొంతం చేసుకున్న విజ‌య్ దేవ‌ర‌కొండ తాజాగా న‌టిస్తోన్న చిత్రం నోటా. తెలుగు, త‌మిళ్‌లో రూపొందుతోన్న ఈ చిత్రానికి ఆనంద్ శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. విజ‌య్ దేవ‌ర‌కొండ స‌ర‌స‌న మెహ్రీన్, సంచ‌న న‌ట‌రాజ‌న్ న‌టిస్తున్నారు. ఈ సినిమాని స్టూడియో గ్రీన్ బ్యాన‌ర్ పైన జ్ఞాన‌వేల్ రాజా నిర్మిస్తున్నారు. 
 
పొలిటికల్ బ్యాక్‌డ్రాప్‌తో రూపొందుతోన్న ఈ చిత్రాన్ని అక్టోబ‌ర్ 4న రిలీజ్ చేయ‌నున్నారు. ఈ సంద‌ర్భంగా నోటా థియేట్రిక‌ల్ ట్రైల‌ర్‌ను ఈ నెల 6న సాయంత్రం 4 గంట‌ల‌కు రిలీజ్ చేయ‌నున్న‌ట్టు విజ‌య్ దేవ‌ర‌కొండ ట్విట్ట‌ర్ ద్వారా తెలియ‌చేసారు. దీంతో అక్టోబ‌రులో పోటీ లేకుండా వ‌స్తున్నాం అనుకున్న అర‌వింద టీమ్ ఇప్పుడు విజ‌య్ దేవ‌ర‌కొండ వ‌స్తుండ‌టం... ఆ త‌ర్వాత రామ్ సినిమా వ‌స్తుండ‌టం.. అలాగే విశాల్ పందెం కోడి 2 కూడా వ‌స్తుండ‌టంతో టెన్ష‌న్ ప‌డుతున్నార‌ట‌. అదీ సంగ‌తి.

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments