Webdunia - Bharat's app for daily news and videos

Install App

రెహ్మాన్‌కు హిందీ అంటే అంత భయమా... వేదిక దిగి వెళ్లిపోయిన సంగీత దర్శకుడు.. !!

Webdunia
శనివారం, 27 మార్చి 2021 (13:21 IST)
ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్. రెహ్మాన్ తొలిసారి నిర్మాతగా మారి నిర్మించిన చిత్రం 99 సాంగ్స్. కాశ్మీర్ యువకుడు ఇహాన్ భట్ హీరోగాను, ఎడిల్సీ వర్గీస్‌ హీరోయిన్‌గా వెండితెరకు పరిచయం అవుతున్నారు. ఈ చిత్రం ట్రైలర్ లాంచ్ కార్యక్రమం తాజాగా చెన్నైలో జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఏఆర్ రెహ్మాన్ 'హిందీనా' అంటూ వేదిక దిగి వెళ్లిపోయారు. ఈ కార్యక్రమంలో అసలు ఏం జరిగిందో ఓసారి తెలుసుకుందాం. 
 
ఈ కార్యక్రమం ప్రారంభోత్సవంలో ఏఆర్ రెహ్మాన్‌, హీరో ఇహాన్‌ను తొలుత వ్యాఖ్యాత వేదికపైకి ఆహ్వానించారు. వేదికపై రెహ్మన్‌తో ఆ వ్యాఖ్యాత తమిళంలో మాట్లాడారు. కానీ, హీరో ఇహాన్ భట్‌తో మాత్రం భాష మార్చింది. హిందీలో మాట్లాడుతూ స్వాగతం పలికింది. 'ఎహాన్ భట్ జీ చెన్నై మే ఆప్ కా హార్దిక్ స్వాగత్ కర్తీ హూ (ఎహాన్ భట్ గారూ.. చెన్నై మీకు హృదయపూర్వక స్వాగతం పలుకుతోంది)' అంటూ వ్యాఖ్యానించింది.
 
దీంతో రెహ్మాన్ ఒక్కసారిగా ‘హిందీనా’ అంటూ యాంకర్ వైపు చూశారు. ఆ తర్వాత నవ్వుకుంటూ వేదిక దిగుతూ, స్టెప్స్‌పై ఒక్కసారి ఆగి 'ముందే అడిగాను.. తమిళ్ మాట్లాడతారా? అని' సరదాగా అడుగి నవ్వుతూ వెళ్లి తన సీట్లో కూర్చొన్నారు. 
 
దానికి సంబంధించిన వీడియో ఇప్పుడు ఇన్‌స్టాగ్రామ్‌లో వైరల్ అవుతోంది. కాగా, 99 సాంగ్స్ సినిమాకు రెహ్మాన్ కూడా కథా సహకారం అందించారు. ఆయన సొంత నిర్మాణ సంస్థ ‘వైఎం మూవీస్’ బ్యానర్‌పై సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రం ఏప్రిల్ 16వ తేదీన ప్రేక్షకుల ముందుకురానుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

విద్యార్థి తండ్రితో టీచరమ్మ పరిచయం - అఫైర్.. ఆపై రూ.20 లక్షల డిమాండ్

అక్కకి పెళ్లైందని బావ ఇంటికెళితే... మరదలిపై 7 ఏళ్లుగా అత్యాచారం

ప్రపంచంలోనే ప్రమాదకరమైంది కింగ్ కోబ్రా కాదు.. నత్త.. తెలుసా?

ఈ మోనాలిసాకి ఏమైంది? కన్నీటి పర్యంతమై కనిపిస్తోంది (video)

వాట్సప్ ద్వారా వడ్లు అమ్ముకుంటున్న ఆంధ్ర రైతులు, గంటల్లోనే డబ్బు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ 5 పదార్థాలను పరగడుపున తింటే?

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయి అధికబరువు తగ్గిపోవాలంటే?

దగ్గుతో రక్తం కక్కుకుంటున్నారు, రష్యాలో కొత్తరకం వైరస్, వేలల్లో రోగులు

అలాంటి వేరుశనక్కాయలు, ఎండుమిర్చి తింటే కేన్సర్ ప్రమాదం

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments