Webdunia - Bharat's app for daily news and videos

Install App

లెహరాయి చిత్రం నుండి అప్సరస అప్సరస పాట విడుదల

Webdunia
మంగళవారం, 27 సెప్టెంబరు 2022 (13:21 IST)
Apsarasa Apsarasa song -Leharai
బెక్కం వేణుగోపాల్ సమర్పణలో ఎస్ ఎల్ ఎస్ మూవీస్ నిర్మాణ సంస్ణ లో రంజిత్, సౌమ్య మీనన్ హీరో హీరోయిన్స్ గా, ధ‌ర్మ‌పురి ఫేం గగన్ విహారి, రావు రమేష్, సీనియర్ నరేష్, అలీ నటీనటులుగా రామకృష్ణ పరమహంస ని ద‌ర్శ‌కుడి గా ప‌రిచ‌యం చేస్తూ మద్దిరెడ్డి శ్రీనివాస్ నిర్మిస్తున్న చిత్రం లెహరాయి.
 
ఈ చిత్ర టైటిల్ చాలా ఫేమ‌స్ కావ‌టం విశేషం. ఇదివరకే ఈ చిత్రం నుంచి రిలీజైన టీజర్ కు, సాంగ్స్ కు విశేష స్పందన లభించింది. ఇక సంగీత ద‌ర్శకుడు ఘంటాడి కృష్ణ ఈ చిత్రంతో జీకే ఈజ్ బ్యాక్ అన్నట్టు సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేశారు. ఇప్పటికే ఈ చిత్రం నుండి విడుద‌లైన గుప్పెడంత సాంగ్ మిలియ‌న్ వ్యూస్ తెచ్చుకుంది.
 
ఈ స‌క్సస్ ని పురస్కరించుకుని లెహ‌రాయి చిత్రం నుండి "అప్సరస అప్సరస" అనే మరో  సాంగ్ ను కూడా విడుద‌ల చేశారు మేకర్స్. గేయ రచయిత శ్రీమణి రచించిన ఈ పాటని రేవంత్  ఆల‌పించారు.
"తీపితో తేల్చి చెప్పా
తొలితీపి  నీ పలుకని
తారనే పిలిచి చూపా
తొలి తారా నీ నవ్వని" లాంటి  లైన్స్ మంచి ఫీల్ ను క్రియేట్ చేస్తుంది.
 
ఈ చిత్రంలో మొత్తం 7 సాంగ్స్ ఉన్నట్లు, మంచి ఫీల్ వున్న క‌థతో ఈ చిత్రాన్ని తెర‌కెక్కించినట్లు ఇదివరకే ద‌ర్శకుడు రామ‌కృష్ణ ప‌ర‌మ‌హంస" తెలిపారు.ప్రముఖులు న‌టించిన ఈ చిత్రాన్ని నిర్మాత బెక్కం వేణుగోపాల్ సమర్పిస్తున్నారు. లెహరాయి రిలీజ్ డేట్ ను త్వరలోనే అధికారికంగా ప్రకటించనుంది చిత్ర బృందం.    
 
నటీనటులు: రంజిత్, సౌమ్య మీనన్, గగన్ విహారి, రావు రమేష్, సీనియర్ నరేష్, అలీ,సత్యం రజెష్, జబర్దస్త్ రాంప్రసాద్ తదితరులు.
సాంకేతిక నిపుణులు :సమర్పకులు : బెక్కం వేణుగోపాల్,  నిర్మాత : మద్దిరెడ్డి శ్రీనివాస్, రైటర్, డైరెక్టర్ : రామకృష్ణ పరమహంస,  మ్యూజిక్ : జీకే (ఘంటాడి కృష్ణ), సినిమాటోగ్ర‌ఫీ: ఎం ఎన్ బాల్ రెడ్డి, ఎడిటర్ : ప్రవీణ్ పూడి, లిరిక్ రైటర్స్ : రామజోగయ్య శాస్త్రి, కాసర్ల శ్యామ్ , శ్రీమణి,  ఫైట్ మాస్టర్ : శంకర్,  కొరియోగ్రాఫర్స్ : అజయ్ సాయి,  రైటర్ : పరుచూరి నరేష్ పి ఆర్.ఓ : ఏలూరు శీను, మేఘశ్యామ్

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మహా పీఠముడి... మహారాష్ట్ర కొత్త ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరు?

డోనాల్డ్ ట్రంప్‌కు భారీ ఊరట.. ఏంటది..?

అరెస్టుకు సిద్ధంగా పోలీసులు.. పారిపోయిన రాంగోపాల్ వర్మ!!

బంగాళాఖాతంలో అల్పపీడనం : ఏపీతో సహా ఆ రాష్ట్రాలకు భారీ వర్ష సూచన

అదానీ ఇచ్చిన రూ. 100 కోట్లు విరాళం నిరాకరిస్తున్నాం: సీఎం రేవంత్ రెడ్డి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శ్వాసకోశ సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

బార్లీ వాటర్ ఎందుకు తాగాలి? ప్రయోజనాలు ఏమిటి?

ఫుట్ మసాజ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

బాదంపప్పులను తింటుంటే వ్యాయామం తర్వాత త్వరగా కోలుకోవడం సాధ్యపడుతుందంటున్న పరిశోధనలు

సింక్రోనస్ ప్రైమరీ డ్యూయల్ క్యాన్సర్‌లకు అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విజయవంతమైన చికిత్స

తర్వాతి కథనం
Show comments