Webdunia - Bharat's app for daily news and videos

Install App

పెప్సీ ఆంటీగా మారిన అప్సరా రాణి - 'సీటీమార్' సాంగ్ రిలీజ్

Webdunia
సోమవారం, 22 మార్చి 2021 (06:15 IST)
సెన్సేషనల్ స్టార్ గోపీచంద్, మిల్కీబ్యూటీ తమన్నా జంటగా నటించిన చిత్రం సీటీమార్. సంపత్ నంది దర్శకుడు. ఏప్రిల్ రెండో తేదీన ప్రేక్షకుల ముందుకురానుంది. దీంతో ఈ సినిమా ప్ర‌మోష‌న్స్‌ను వేగవంతం చేశారు.
 
తాజాగా చిత్రం నుండి "నా పేరే పెప్సీ ఆంటీ" అనే సాంగ్ విడుద‌ల చేశారు. 'క్రాక్' సినిమాలో ‘భూం బద్దల్’ అన్న సాంగ్‌తో ఓ ఊపు ఊపిన అప్స‌ర రాణి ఇప్పుడు నా పేరే పెప్సీ ఆంటీ అంటూ ‌సోష‌ల్ మీడియాను షేక్ చేస్తుంది. పాట‌తో పాటు డ్యాన్స్ కూడా మాస్ స్టైల్‌లో ఉండ‌నుండ‌గా, ఇది ప్రేక్ష‌కుల‌ని ఎంత‌గానో అల‌రిస్తుంద‌ని అంటున్నారు.
 
పవన్ కుమార్ సమర్పణలో శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యాన్‌ర్‌పై శ్రీనివాస్ చిట్టూరి నిర్మిస్తున్న "సీటీమార్" చిత్రం కబడ్డీ ఆట నేపథ్యంలో తెరకెక్కుతోంది. గోపీచంద్ ఏపీకి కోచ్‌గా, తమన్నా తెలంగాణ కోచ్‌గా కనిపించనున్నారు. 
 
ఇటీవల ఈ సినిమా నుంచి "జ్వాలా రెడ్డి" అన్న సాంగ్ రిలీజై అభిమానులను బాగా ఆకట్టుకుంది. ఈ క్రమంలో 'సీటీమార్' సినిమా నుంచి మాస్ సాంగ్ రిలీజ్ చేసి సినిమాపై హైప్ పెంచే ప్ర‌య‌త్నం చేశారు మేక‌ర్స్ . మ‌ణిశ‌ర్మ అందించిన సంగీతం ఆక‌ట్టుకునేలా ఉంది.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

టీడీపీ జెండాను పట్టుకున్న నందమూరి హీరో కళ్యాణ్ రామ్.. మా మధ్య అవి లేవండి?

అన్నా ఒకసారి ముఖం చూస్కో.. ఎలా అయిపోయావో.. వంశీ అభిమానుల ఆందోళన (video)

అమరావతిలో చంద్రబాబు శాశ్వత ఇంటి నిర్మాణం ప్రారంభం.. ఎప్పుడు.. ఎక్కడ?

ఎస్బీఐ బ్యాంకు దొంగతనం- బావిలో 17 కిలోల బంగారం స్వాధీనం

మయన్మార్‌ భూకంపం.. 2,056కి పెరిగిన మృతుల సంఖ్య

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయి అధికబరువు తగ్గిపోవాలంటే?

దగ్గుతో రక్తం కక్కుకుంటున్నారు, రష్యాలో కొత్తరకం వైరస్, వేలల్లో రోగులు

అలాంటి వేరుశనక్కాయలు, ఎండుమిర్చి తింటే కేన్సర్ ప్రమాదం

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

తర్వాతి కథనం
Show comments