భేషుగ్గా రజనీకాంత్ ఆరోగ్యం : అపోలో ఆస్పత్రి హెల్త్ బులిటెన్

ఠాగూర్
మంగళవారం, 1 అక్టోబరు 2024 (17:30 IST)
సూపర్ స్టార్ రజనీకాంత్ ఆరోగ్యంగా ఉన్నారని, మరో 2 రోజుల్లో ఇంటికి తిరిగి వస్తారని అపోలో ఆసుపత్రి తెలిపింది. హాస్పిటల్ విడుదల చేసిన హెల్త్ బులిటెన్‌‍లో 'రజనీకాంత్ సెప్టెంబర్ 30 న క్రీమ్స్ రోడ్‌లోని అపోలో హాస్పిటల్‌లో చేరారు. అతని గుండె నుంచి వెళ్లే ప్రధాన రక్తనాళం వాచిపోయింది. అతను నాన్-సర్జికల్ ట్రాన్స్‌కాథెటర్ విధానంతో చికిత్స చేశాం. సీనియర్ కార్డియాలజిస్ట్ సాయి సతీష్ రజనీ రక్త నాళానికి స్టంట్ చేశారు. ప్రణాళిక ప్రకారం అన్నీ పూర్తయ్యాయి. ఈ విషయాన్ని రజనీ అభిమానులకు, శ్రేయోభిలాషులకు తెలియజేస్తున్నాం. రజనీ బాగానే ఉన్నారు. రెండు రోజుల్లో డిశ్చార్జ్ అవుతారు అని పేర్కొన్నారు. 
 
అంతకుముందు ముఖ్యమంత్రి స్టాలిన్ 'రజనీకాంత్ త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను' అని పోస్ట్ చేశారు. రజనీకాంత్ త్వరగా కోలుకోవాలని ప్రపంచవ్యాప్తంగా ఉన్న లక్షలాది మంది అభిమానులతో పాటు నేనూ ప్రార్థిస్తున్నాను అని తమిళనాడు గవర్నర్ ఆర్‌ఎన్ రవి ఎక్స్ సైట్‌లో పోస్ట్ చేశారు. అనారోగ్య కారణాలతో ఆసుపత్రిలో చేరిన నా స్నేహితుడు నటుడు రజనీకాంత్ త్వరగా కోలుకుని ఇంటికి తిరిగి రావాలని నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అని బామా అధ్యక్షుడు అన్బుమణి రామదాస్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
 
కాగా, ప్రస్తుతం రజనీకాంత్ లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో 'కూలీ' చిత్రంలో నటిస్తున్నారు. టి.ఎస్ జ్ఞానవేల్ దర్శకత్వం వహించిన 'వెట్టయన్' అక్టోబర్ 10న విడుదల కానుంది. ఈ చిత్రంలో అమితాబ్ బచ్చన్, రజనీకాంత్, రానా, ఫకత్ బాసిల్, మంజు వారియర్, రితికా సింగ్, రక్షణ తదితరులు నటిస్తున్నారు. అనిరుధ్ సంగీతం అందించిన ఈ చిత్రాన్ని లైకా సంస్థ నిర్మించింది. ఇటీవలే ఈ సినిమా టీజర్‌ను విడుదల చేయగా, రేపు (అక్టోబర్ 2) చిత్ర ట్రైలర్‌ను చిత్ర బృందం విడుదల చేయనుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Vizag: కైలాసగిరి కొండలపై కాంటిలివర్ గాజు వంతెన ప్రారంభం

ఐదేళ్ల చిన్నారిపై పాశవికంగా దాడి చేసిన ఆయా

మహిళా వ్యాపారవేత్తను తుపాకీతో బెదిరించి, దుస్తులు విప్పించి లైంగిక వేధింపులు..

భర్తను హత్య చేసిన భార్య.. గొడవలే గొడవలు.. ఇంట్లోకి రానివ్వకపోవడంతో..?

కుమార్తెను ప్రేమిస్తున్నాడనీ యువకుడిని చంపేశారు... అయినా శవాన్నే పెళ్లి చేసుకున్న యువతి...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

winter health, జామ ఆకుల కషాయం చేసే మేలు తెలుసా?

ఈ అనారోగ్య సమస్యలున్నవారు ఉదయాన్నే గోరువెచ్చని నీటిని తాగరాదు

శీతాకాలంలో లవంగం దగ్గర పెట్టుకోండి, బాగా పనికొస్తుంది

winter tips, వెల్లుల్లిని ఇలా చేసి తింటే?

కాలిఫోర్నియా బాదంతో రెండు సూపర్‌ఫుడ్ రెసిపీలతో శీతాకాలపు ఆరోగ్యం ప్రారంభం

తర్వాతి కథనం
Show comments