Webdunia - Bharat's app for daily news and videos

Install App

మాతృ మూవీ నుంచి మదర్ సెంటిమెంట్ తో అపరంజి బొమ్మ. పాట

దేవి
శనివారం, 22 ఫిబ్రవరి 2025 (09:43 IST)
Sriram-apranji song
మాతృ దేవో భవ నుంచి బిచ్చగాడు వరకు మదర్ సెంటిమెంట్‌తో ఎన్నెన్నో కల్ట్ క్లాసిక్‌గా నిలిచాయి. ఇప్పుడు ఇదే మదర్ సెంటిమెంట్‌తో ఓ చిత్రం రాబోతోంది. శ్రీ పద్మిని సినిమాస్ బ్యానర్ మీద శ్రీ పద్మ సమర్పణలో  బి. శివ ప్రసాద్ నిర్మించిన చిత్రం ‘మాతృ’. శ్రీరామ్, నందినీ రాయ్, సుగి విజయ్, రూపాలి భూషణ్ వంటి వారు ముఖ్య పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి జాన్ జక్కీ దర్శకత్వం వహించారు.
 
ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ పూర్తి అయింది. త్వరలోనే విడుదల చేసేందుకు చిత్రయూనిట్ సిద్దమైంది. ఈ క్రమంలోనే ప్రమోషన్స్ పెంచేశారు. మాతృ టైటిల్‌కు తగ్గట్టుగా సాగే ఓ మదర్ సెంటిమెంట్ తో ఎమోషనల్ సాంగ్‌ను రిలీజ్ చేశారు. అపరంజి బొమ్మ.. మా అమ్మ అంటూ సాగే ఈ పాటను దినేశ్ రుద్ర ఆలపించగా.. బి. శివ ప్రసాద్ సాహిత్యాన్ని అందించారు. శేఖర్ చంద్ర బాణీ హృదయాన్ని హత్తుకునేలా ఉంది. ఈ పాట అందరి హృదయాల్ని కరిగించేలా ఉంది. ప్రస్తుతం ఈ పాట యూట్యూబ్‌లో ట్రెండింగ్‌లో ఉంది.
 
ఇక ఈ సినిమా నిర్మాతే ఇంతటి గొప్ప పాటను రాయడం విశేషం. ఈ చిత్రానికి రాహుల్ శ్రీ వాత్సవ్ కెమెరామెన్‌గా, సత్యనారాయణ బల్లా ఎడిటర్‌గా  పని చేశారు. త్వరలోనే ఈ సినిమాను గ్రాండ్‌గా రిలీజ్ చేయబోతున్నారు.
 
తారాగణం : శ్రీరామ్, నందిని రాయ్, సుగి విజయ్, రూపాలి భూషణ్, అలీ, ఆమని, కాలే రవి, దేవి ప్రసాద్, పృధ్వి తదితరులు

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

భార్యాభర్తల మధ్య గొడవ.. మద్యం మత్తులో కుమార్తె గొంతుకోసి...

యాంకర్ స్వేచ్ఛతో సన్నిహిత సంబంధం నిజమే... : పూర్ణచందర్

ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం : సీఎం చంద్రబాబు

పుల్లెల గోపీచంద్ అకాడమీలో తమ సరికొత్త క్లినిక్‌ను ప్రారంభించిన వెల్నెస్ కో

ప్రియురాలుని బైక్ ట్యాంక్ పైన పడుకోబెట్టి వేగంగా నడుపుతూ యువకుడు రొమాన్స్ (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పరగడుపున తినకూడని 8 పండ్లు

కొలెస్ట్రాల్‌ను నియంత్రించుకోవడానికి సహాయపడే 4 ఆహారాలు

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments