Webdunia - Bharat's app for daily news and videos

Install App

దేవసేనకు చేదు అనుభవం.. పొల్లాచ్చిలో కారవాన్ సీజ్..

దేవసేనకు తమిళనాడులో చేదు అనుభవం ఎదురైంది. షూటింగ్ కోసం కోవై జిల్లా పొల్లాచ్చికి వెళ్లిన నటి అనుష్కకు తమిళనాడు రవాణా అధికారులు షాకిచ్చారు. షూటింగ్ స్పాట్‌లో ఆమె కోసం ఏర్పాటు చేసిన కారవాన్ వాహనాన్ని రవా

Webdunia
గురువారం, 1 జూన్ 2017 (14:10 IST)
దేవసేనకు తమిళనాడులో చేదు అనుభవం ఎదురైంది. షూటింగ్ కోసం కోవై జిల్లా పొల్లాచ్చికి వెళ్లిన నటి అనుష్కకు తమిళనాడు రవాణా అధికారులు షాకిచ్చారు. షూటింగ్ స్పాట్‌లో ఆమె కోసం ఏర్పాటు చేసిన కారవాన్ వాహనాన్ని రవాణా శాఖాధికారులు స్వాధీనం చేసుకున్నారు. బాహుబలి ది  కంక్లూజన్ చిత్రం తరువాత "భాగమతి" సినిమా కథానాయకిగా అనుష్క నటిస్తోంది. 
 
పిల్ల జమీందార్ ఫేం అశోక్ దర్శకత్వంతో హారర్ జానర్‌లో భాగమతి నిర్మితమవుతోంది. ఆది పినిశెట్టి, ఉన్ని ముకుందన్ ముఖ్యపాత్రల్లో నటిస్తున్నారు. ఆగస్టు రెండు వారంలో ఈ చిత్రాన్ని విడుదల చేయాలని చిత్ర యూనిట్ భావిస్తోంది.
 
ఈ భాగమతి చిత్రం షూటింగ్ పొల్లాచ్చిలో జరుగుతోంది. అక్కడ హోటల్లో బస చేసిన అనుష్క ఆ చిత్రం షూటింగ్ కోసం లోకేషన్స్‌కు వెళ్లేందుకు వీలుగా ఓ కారవాన్ వాహనాన్నిఉపయోగిస్తున్నారు. అయితే ఆ వాహనాన్ని ఉపయోగించేందుకు తగిన అనుమతి పత్రాలు లేకపోవడంతో ఆ వాహనాన్ని సీజ్ చేశారు. ఈ సంఘటన ఆ ప్రాంతంలో కలకలానికి దారి తీసింది.
అన్నీ చూడండి

తాజా వార్తలు

రిఫ్రిజిరేటర్‌లో మహిళ మృతదేహం.. చీర కట్టుకుని, ఆభరణాలు ధరించి, మెడకు ఉచ్చు..

Sankranthi: సంక్రాంతి రద్దీ.. టోల్ ప్లాజాల వద్ద ట్రాఫిక్ జామ్

తెలంగాణలో క్రిప్టోకరెన్సీ మోసం.. రూ.95 కోట్ల మోసం.. వ్యక్తి అరెస్ట్

స్కూలు బ్యాగు తగిలించుకుని కుర్చీలో కూర్చున్నఫళంగా గుండెపోటుతో 8 ఏళ్ల చిన్నారి మృతి (Video)

సారీ చెబితే తిరుపతి తొక్కిసలాటలో చనిపోయినవారు తిరిగొస్తారా? (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

దొండ కాయలు గురించి ఆయుర్వేదం ఏం చెబుతోంది?

సంక్రాంతి పండుగకి పోషకాలతో కూడిన కాలిఫోర్నియా బాదం వంటకం

అరటి కాండం రసం తాగితే ఏమవుతుంది?

ఎముకలు దృఢంగా వుండాలంటే వేటిని తినాలి?

తులసి, అల్లం, అతిమధురం.. ప్రాణాపాయం.. గోరువెచ్చని ఉప్పు నీటితో..?

తర్వాతి కథనం
Show comments