Webdunia - Bharat's app for daily news and videos

Install App

'సైరా'లో ఝాన్సీ లక్ష్మీబాయ్‌గా అనుష్క...

Webdunia
ఆదివారం, 8 సెప్టెంబరు 2019 (17:14 IST)
ఝాన్సీ లక్ష్మీబాయ్‌గా అనుష్క కనిపించనుంది. లేడీ ఓరియెంటెడ్ చిత్రాల‌తో హీరోల‌కి స‌మానంగా ఆద‌ర‌ణ పొందింది. ఈమె ప్రస్తుతం "నిశ్శ‌బ్దం" అనే చిత్రం చేస్తుంది. ఈ సినిమా అతి త్వ‌ర‌లోనే ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. 
 
అయితే అక్టోబరు రెండో తేదీన భారీ స్థాయిలో విడుద‌ల కానున్న "సైరా" చిత్రంలో అనుష్క ముఖ్య పాత్ర పోషించింద‌ని కొన్నాళ్ళుగా వార్త‌లు వినిపిస్తున్నాయి. దీనిపై ఎలాంటి క్లారిటీ రాన‌ప్ప‌టికి అభిమానులు మాత్రం అనుష్క సినిమాలో క‌నిపించ‌నుంద‌ని విశ్వ‌సిస్తున్నారు.
 
తాజా స‌మాచారం ప్ర‌కారం 'సైరా' చిత్రంలో అనుష్క ఝాన్సీ లక్ష్మీబాయి పాత్రలో క‌నిపించ‌నుంద‌ని తెలుస్తుంది. చిరంజీవి త‌ర్వాత అంత‌టి పవ‌ర్ ఫుల్ రోల్ అనుష్క‌దే అని అంటున్నారు. పాత్ర చాలా కీల‌కం కాబ‌ట్టి ఈ విష‌యాన్ని సీక్రెట్‌గా ఉంచుతున్నార‌ట‌. 
 
కె.సురేంద‌ర్ రెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న 'సైరా' చిత్రంలో సుదీప్, విజయ్ సేతుపతి, జగపతిబాబు, త‌మ‌న్నా, న‌య‌న‌తార‌, నిహారిక‌ వంటి స్టార్‌లు కూడా నటిస్తున్నారు. భారీ బడ్జెట్‌తో హీరో రామ్ చరణ్ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని తెలుగుతో పాటు తమిళం, కన్నడ, హిందీ, మలయాళ భాషల్లో కూడా భారీ స్థాయిలో విడుదల చేయనున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

వరిపంట వేస్తే ఉరితో సమానమంటూ బీఆర్ఎస్ నేతలు ప్రచారం చేశారు : మంత్రి సీతక్క

బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం : ఆంధ్రా - ఒరిస్సాలకు వర్ష హెచ్చరిక

నివాస భవనంలోకి దూసుకెళ్లిన విమానం.. పది మంది మృతి... ఎక్కడ?

తండ్రి అప్పు తీర్చలేదని కుమార్తెను కిడ్నాప్ చేసిన వడ్డీ వ్యాపారులు.. ఎక్కడ?

పంట పొలంలో 19 అడుగుల కొండ చిలువ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాగి పాత్రలో మంచినీటిని తాగితే 7 ఫలితాలు

పాలు తాగితే 8 ప్రయోజనాలు, ఏమిటి?

శీతాకాలంలో తినాల్సిన ఆహార పదార్థాలు ఏంటి?

ప్రతిష్టాత్మక IIT మద్రాస్ CSR అవార్డు 2024 గెలుచుకున్న హెర్బాలైఫ్ ఇండియా

పొడియాట్రిక్ పాదాలు-చీలమండ చికిత్సను మెరుగుపరచడానికి ఇసావోట్ అత్యాధునిక ఓ-స్కాన్ ఎంఆర్ఐ మెషీన్‌

తర్వాతి కథనం
Show comments