అనుష్క కొత్త సినిమా ఫ‌స్ట్ లుక్ రిలీజ్‌కి ముహుర్తం

శుక్రవారం, 6 సెప్టెంబరు 2019 (14:07 IST)
అందం, అభిన‌యం ఈ రెండు ఉన్న అతి కొద్దిమంది క‌ధానాయిక‌ల్లో అనుష్క ఒక‌రు. సూప‌ర్ సినిమాతో టాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చిన ఈ అమ్మ‌డు అరుంధతి, బాహుబ‌లి, రుద్ర‌మ‌దేవి, భాగ‌మ‌తి... ఇలా విభిన్న క‌థా చిత్రాల్లో వైవిధ్య‌మైన పాత్ర‌లు పోషించి ప్రేక్ష‌క హృద‌యాల్లో సుస్ధిర స్ధానం సంపాదించుకున్నారు. కొంతకాలంగా క‌థానాయిక ప్రాధాన్యత కలిగిన సినిమాలు చేస్తూ .. విజయాలను అందుకుంటూ వస్తోన్న అనుష్క‌ తాజా చిత్రంగా నిశ్శబ్దం.
 
హేమంత్ మధుకర్ దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమాలో ఆమె ప్రధానమైన పాత్రను పోషిస్తోంది. కోన ఫిల్మ్ కార్పొరేషన్ .. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ వారు సంయుక్తంగా నిర్మిస్తోన్న ఈ సినిమా నుంచి రానున్న ఫస్టులుక్ కోసం అభిమానులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ నెల 11వ తేదీన ఉదయం 11 గంటల 11 నిమిషాలకి ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేయనున్నామని తెలియజేస్తూ ఒక పోస్టర్‌ను రిలీజ్ చేసారు.
 
కథాపరంగా విదేశాల్లోనే ఈ సినిమా షూటింగ్ చేస్తూ వస్తున్నారు. మైఖేల్ మ్యాడ్సన్ అనే విదేశీ నటుడితో పాటు, మాధవన్ .. అంజలి .. షాలినీ పాండే .. సుబ్బరాజు ముఖ్యమైన పాత్రల్లో కనిపించనున్నారు. గోపీసుందర్ అందించిన సంగీతం ఈ సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని అంటున్నారు. మ‌రి..ఈ సినిమాతో అనుష్క టాలీవుడ్ లో ఎలాంటి సెన్సేష‌న్ క్రియేట్ చేస్తుందో చూడాలి.

వెబ్దునియా పై చదవండి

తర్వాతి కథనం అసభ్యతకు తావులేని క్లీన్ మూవీ "నీ కోసం" (రివ్యూ)