Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

మాంచి మూడ్‌లో బాల‌య్య‌ - కుర్ర హీరోయిన్‌తో రొమాన్స్

Advertiesment
మాంచి మూడ్‌లో బాల‌య్య‌ - కుర్ర హీరోయిన్‌తో రొమాన్స్
, గురువారం, 5 సెప్టెంబరు 2019 (12:14 IST)
టాలీవుడ్ సీనియర్ నందమూరి బాలకృష్ణ - తమిళ దర్శకుడు కేఎస్ రవికుమార్ కాంబినేషన్‌లో ఓ చిత్రం తెరకెక్కుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత సి.కళ్యాణ్ నిర్మిస్తున్నారు. ఇందులో హీరోయిన్‌గా కుర్రహీరోయిన్లు సోనాల్ చౌహాన్, వేదిక నటిస్తోంది. భూమికా చావ్లా కీలక పాత్రలోనూ, నమిత లేడీ విలన్‌గా నటిస్తోంది.
 
ఎన్.బి.కె.105 పేరుతో నిర్మితమవుతున్న ఈ చిత్రానికి రూలర్ అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నట్టు సమాచారం. ఈ క్రమంలో ఈ చిత్ర షూటింగ్ ప్రారంభం కాగా, బాల‌య్య‌కి సంబంధించిన కొన్ని ఫోటోలు బ‌య‌ట‌కి వ‌చ్చాయి. ఇందులో బాల‌య్య లుక్ ఫ్యాన్స్‌కి మంచి కిక్ ఇచ్చింది. సోనాల్ చౌహ‌న్‌, వేదిక చిత్రంలో క‌థానాయిక‌లుగా న‌టిస్తార‌ని తెలుస్తుండ‌గా, భూమిక చావ్లా కీల‌క పాత్ర‌లో క‌నిపించ‌నుంద‌ట‌. 
 
ఈ చిత్రంలో బాల‌య్య పోలీస్ ఆఫీస‌ర్‌గా, గ్యాంగ్‌స్ట‌ర్‌గా రెండు పాత్ర‌లు పోషిస్తున్నాడ‌ని అంటున్నారు. "జైసింహా" త‌ర్వాత కేఎస్ ర‌వికుమార్ - బాల‌య్య కాంబినేష‌న్‌లో మ‌రో చిత్రం రానుండ‌డంతో ఈ సినిమాపై అభిమానుల‌లో భారీ అంచ‌నాలే ఉన్నాయి. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన యాక్ష‌న్ ఎపిసోడ్ రామోజీ ఫిలిం సిటీలో మొద‌లు పెట్టారు. అన్బూ, అర‌వి యాక్ష‌న్ కొరియోగ్రాఫ‌ర్‌గా ప‌ని చేయ‌నున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రజినీకాంత్ అల్లుడు పాస్‌పోర్టు మిస్సింగ్...