Webdunia - Bharat's app for daily news and videos

Install App

మంచి స్క్రిప్ట్ దొరికితే ప్రభాస్‌తో కలిసి సినిమా చేస్తాను.. స్వీటీ

Webdunia
గురువారం, 7 సెప్టెంబరు 2023 (14:15 IST)
అనుష్క శెట్టి చివరిసారిగా నిశ్శబ్ధంలో కథానాయికగా కనిపించింది. స్వీటీ వెండితెరపై కనిపించి దాదాపు నాలుగేళ్లు కావస్తోంది. తాజాగా నవీన్ పొలిశెట్టి ప్రధాన పాత్రలో ఆమె నటించిన మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి సినిమా శుక్రవారం విడుదలైంది.
 
ఇటీవల అనుష్క శెట్టి తన చిత్రం మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి ప్రమోషన్‌లో భాగంగా తన బెస్ట్ ఫ్రెండ్ ప్రభాస్ గురించి మాట్లాడింది. ప్రభాస్-అనుష్కల కాంబినేషన్ సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. బిల్లా, మిర్చి, బాహుబలి 1, 2 చిత్రాల్లో కలిసి పనిచేశారు.
 
ఈ సినిమాలన్నీ విజయవంతమయ్యాయి. వీరిద్దరి మధ్య మంచి స్నేహం కూడా ఉంది. వీరిద్దరూ ప్రేమించుకుంటున్నారని, పెళ్లి చేసుకోబోతున్నారని గతంలో ఎన్ని కథనాలు వచ్చినా పట్టించుకోలేదు.
 
తాజాగా ప్రభాస్ గురించి అనుష్క శెట్టి మాట్లాడుతూ.. దాదాపు 15 ఏళ్లుగా ప్రభాస్ గురించి నాకు తెలుసు. ఇప్పుడు పెద్ద స్టార్ అయిపోయాడు. అయితే అప్పటికి ఇప్పుడు అలాగే ఉన్నాడు. అదే మంచి స్నేహం మా మధ్య కొనసాగుతుంది. 
 
ప్రభాస్‌తో మరో సినిమా చేయడానికి సిద్ధంగా ఉన్నాను. అయితే దానికి మంచి స్క్రిప్ట్ ఉండాలి. వేచి చూస్తున్నా. మంచి స్క్రిప్ట్ దొరికితే తప్పకుండా ప్రభాస్‌తో మరో సినిమా చేస్తానని, మళ్లీ నటిస్తానని చెప్పింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పబ్లిక్‌లో ఇదేమీ విడ్డూరంరా నాయనో (Video)

కత్తితో బెదిరించి విమానం హైజాక్‌కు దుండగుడు యత్నం... చివరకు ఏమైంది?

అమరావతిలో దేశంలోనే అతిపెద్ద ఎన్టీఆర్ విగ్రహం.. నరేంద్ర మోదీ పర్మిషన్ ఇస్తారా?

కుక్కల సతీశ్ ఇంట్లో ఈడీ సోదాలు... రూ.50 కోట్ల శునకం ఉత్తుత్తిదేనట

పవన్ కల్యాణ్ చిన్న కుమారిడిపై పరోక్షంగా కామెంట్లు చేసిన రోజా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెదడు పనితీరును పెంచే ఫుడ్

వెర్టిగో గురించి ఈ సోషల్ మీడియా అధ్యయనం కీలక భావనలను వెల్లడిస్తుంది!

పచ్చి ఉల్లిపాయలు తింటే ఏమవుతుంది?

నిద్రలేమి సమస్య వున్నవారు ఇవి తినాలి

బెల్లం - తేనె.. ఈ రెండింటిలో ఏది బెటర్!

తర్వాతి కథనం
Show comments