''సాహో'' టీమ్‌తో స్వీటీ

మిర్చి, బాహుబలి సినిమాలలో కలిసి పని చేసిన ప్రభాస్, అనుష్కలు ఎంతో మంచి స్నేహితులన్న సంగతి అందరికి తెలిసిందే. అనుష్క నటించిన తాజా చిత్రం భాగమతి టీజర్, ట్రైలర్‌కి ప్రభాస్ ప్రశంసలు కురిపించిన విషయం కూడా వ

Webdunia
శనివారం, 13 జనవరి 2018 (14:11 IST)
మిర్చి, బాహుబలి సినిమాలలో కలిసి పని చేసిన ప్రభాస్, అనుష్కలు ఎంతో మంచి స్నేహితులన్న సంగతి అందరికి తెలిసిందే. అనుష్క నటించిన తాజా చిత్రం భాగమతి టీజర్, ట్రైలర్‌కి ప్రభాస్ ప్రశంసలు కురిపించిన విషయం కూడా విదితమే. ఈ నేపథ్యంలో స్వీటీ సాహో టీమ్‌ను కలిసింది. 
 
డైరక్టర్ సుజీత్ దర్శకత్వంలో ప్రభాస్, శ్రద్ధా కపూర్ ప్రధాన పాత్రలుగా సాహో చిత్రం తెరకెక్కుతోంది. అద్భుతమైన యాక్షన్ సన్నివేశాల్లో ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. దుబాయ్‌లో ఈ సినిమా షెడ్యూల్ ప్రారంభం కానుంది. 
 
ఈ షెడ్యూల్‌లో కొన్ని రిస్కీ స్టంట్స్ ఉంటాయని తెలుస్తుండగా, అందుకు తగిన ఫిట్‌నెస్ కోసం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో వైద్యులను అడిగి తెలుసుకునేందుకు ప్రభాస్ అమెరికా వెళ్లినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ప్రభాస్‌ స్నేహితురాలు అనుష్క.. సాహో సెట్లో తళుక్కుమంది. సినిమాలో నటిస్తున్న మురళీశర్మ, ''సాహో'' డైరెక్టర్ సుజీత్, సినిమాటోగ్రాఫర్ మాడీతో కలిసి ఫోటోకు ఫోజిచ్చింది. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కుమార్తెను ప్రేమిస్తున్నాడనీ యువకుడిని చంపేశారు... అయినా శవాన్నే పెళ్లి చేసుకున్న యువతి...

ఇండియన్ టాలెంట్‌తో అమెరికా ఎంతో మేలు జరిగింది : ఎలాన్ మస్క్

Cyclone Ditwah: దిత్వా తుఫాను.. తమిళనాడులో భారీ వర్షాలు

Cyclone Ditwah: దిత్వా తుఫాను బలహీనపడినా.. రెడ్ అలెర్ట్ జారీ.. ఎక్కడ?

Kakinada Ortho Surgeon: ఆపరేషన్ సమయంలో బ్లేడును రోగి శరీరంలో వుంచి కుట్టేశారు..

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

winter health, జామ ఆకుల కషాయం చేసే మేలు తెలుసా?

ఈ అనారోగ్య సమస్యలున్నవారు ఉదయాన్నే గోరువెచ్చని నీటిని తాగరాదు

శీతాకాలంలో లవంగం దగ్గర పెట్టుకోండి, బాగా పనికొస్తుంది

winter tips, వెల్లుల్లిని ఇలా చేసి తింటే?

కాలిఫోర్నియా బాదంతో రెండు సూపర్‌ఫుడ్ రెసిపీలతో శీతాకాలపు ఆరోగ్యం ప్రారంభం

తర్వాతి కథనం
Show comments