Webdunia - Bharat's app for daily news and videos

Install App

నాగార్జున-నాని మల్టీస్టారర్‌లో రకుల్ ప్రీత్ సింగ్..

నాగార్జున- అనుష్క కెమిస్ట్రీ అంటేనే ఫ్యాన్స్ మధ్య మంచి ఫాలోయింగ్ వుంది. అందుకే ఈ జంట వెండితెరపై మళ్లీ మళ్లీ రిపీట్ అవుతూ వుంటుంది. కానీ ఈసారి అనుష్కను రకుల్ ప్రీత్ సింగ్ బీట్ చేసిందని ఫిలిమ్ నగర్ వర్గ

Webdunia
శనివారం, 13 జనవరి 2018 (12:05 IST)
నాగార్జున- అనుష్క కెమిస్ట్రీ అంటేనే ఫ్యాన్స్ మధ్య మంచి ఫాలోయింగ్ వుంది. అందుకే ఈ జంట వెండితెరపై మళ్లీ మళ్లీ రిపీట్ అవుతూ వుంటుంది. కానీ ఈసారి అనుష్కను రకుల్ ప్రీత్ సింగ్ బీట్ చేసిందని ఫిలిమ్ నగర్ వర్గాల్లో జోరుగా ప్రచారం సాగుతోంది. నాగ్- అనుష్క కాంబోలో ఇప్పటికే అరడజను సినిమాలొచ్చాయి. ఛేంజ్ కోసం.. అనుష్క ప్లేసులో రకుల్‌ను తీసుకున్నట్లు సమాచారం. 
 
నాగార్జున, నాని కథానాయకులుగా ఆదిత్య శ్రీరామ్‌ ఈ సినిమాకు దర్శకత్వం వహించనున్న సినిమాలో ర‌కుల్‌ను ఓ క‌థానాయిక‌గా ఫైన‌ల్ చేశార‌ని తెలుస్తోంది. ప్ర‌స్తుతం ప్రీప్రొడ‌క్ష‌న్ స‌హా కాస్టింగ్ సెల‌క్ష‌న్స్ సాగుతున్న ఈ సినిమాలో రకుల్ ప్రీత్ సింగ్ నాని సరసన నటిస్తుందని సమాచారం. ఇక రకుల్  హిందీ చిత్రం ''అయ్యారి'' రిప‌బ్లిక్ డే కానుక‌గా రిలీజ‌వుతున్న సంగ‌తి తెలిసిందే. 
 
ఆ క్ర‌మంలోనే బాలీవుడ్‌లో విస్త్ర‌తంగా ప్ర‌చారంతో బిజీగా ఉంది ర‌కుల్‌. సూర్య 36వ సినిమాలోనూ ర‌కుల్ నాయిక‌గా నటించింది. సెల్వరాఘవన్‌ దర్శకత్వంలో ఈ సినిమా తెర‌కెక్కుతోంది. మహేశ్‌బాబు-వంశీపైడిపల్లి కాంబినేషన్లో సినిమాకి ర‌కుల్‌నే ఎంపిక చేసుకునే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. నాగార్జున-నాని మల్టీస్టారర్‌లో రకుల్ నానికి హీరోయిన్ అయితే.. అనుష్కనే నాగార్జునకు జోడీగా తీసుకునే అవకాశం లేకపోలేదని సినీ వర్గాల్లో టాక్. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

రోడ్డుపై వెళ్తున్న వ్యక్తిపై గాడిద దాడి.. కాలికి తీవ్రగాయం వీడియో వైరల్

నైరుతి బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం... ఆ రెండు పోర్టులకు ప్రమాద హెచ్చరికలు

పోర్టులోకి రైస్ ఎలా వస్తుంది? డిప్యూటీ సీఎం అయిన నాకే సహకారం లేదు: పవన్ విస్మయం (video)

వైనాట్ 175 అన్నారు.. చివరకు 11 వచ్చాయి.. అయినా మార్పు రాలేదు : జగన్‌పై బాలినేని ఫైర్

ఎల్లో మీడియా రాళ్లేస్తోంది.. 48 గంటలే టైమ్... జగన్ లుక్‌పై నెట్టింట చర్చ? (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Mint Juice, శీతాకాలంలో పుదీనా రసం తాగితే?

లెమన్ టీ తాగుతున్నారా? ఐతే వీటిని తినకండి

లవంగం పాలు ఆరోగ్య ప్రయోజనాలు

చియా విత్తనాలు అద్భుత ప్రయోజనాలు

Winter Fruit కమలా పండ్లును తింటే ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments