Webdunia - Bharat's app for daily news and videos

Install App

''భాగమతి'' ఇప్పుడల్లా రాదు..

బాహుబలి దేవసేన అనుష్క ప్రస్తుతం లేడీ ఓరియెంటెడ్ మూవీలో నటిస్తోంది. అరుంధ‌తి, రుద్ర‌మ‌దేవి, బాహుబ‌లి వంటి సినిమాల్లో నటించి తన సత్తా చాటిన దేవసేన.. తాజాగా పిల్ల జ‌మీందార్ ఫేం అశోక్ ద‌ర్శ‌క‌త్వంలో రూపుద

Webdunia
శుక్రవారం, 18 ఆగస్టు 2017 (11:15 IST)
బాహుబలి దేవసేన అనుష్క ప్రస్తుతం లేడీ ఓరియెంటెడ్ మూవీలో నటిస్తోంది. అరుంధ‌తి, రుద్ర‌మ‌దేవి, బాహుబ‌లి వంటి సినిమాల్లో నటించి తన సత్తా చాటిన దేవసేన.. తాజాగా పిల్ల జ‌మీందార్ ఫేం అశోక్ ద‌ర్శ‌క‌త్వంలో రూపుదిద్దుకుంటున్న భాగమతిలో నటిస్తోంది. ఈ సినిమా భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతోంది. షూటింగ్ కూడా పూర్తయ్యింది. ఈ విషయాన్ని చిత్ర నిర్మాణ సంస్థ యూవీ క్రియేష‌న్స్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది.
 
భాగమతిలో అనుష్క లుక్ ఎలా వుంటుందని ప్రేక్షకులు ఆత్రుతగా ఎదురుచూస్తున్న వేళ.. ఈ సినిమాలో అనుష్క లుక్‌ను త్వరలోనే విడుదల చేయాలని సినీ యూనిట్ భావిస్తోంది. సస్పెన్స్ థ్రిల్ల‌ర్ డ్రామాగా తెర‌కెక్కిన భాగ‌మతి చిత్రంలో అనుష్క ప్ర‌ధాన పాత్ర పోషించ‌గా, ఆది పినిశెట్టి ప్ర‌తి నాయ‌కుడి పాత్ర‌లో క‌నిపించ‌నున్నాడు. భాగ‌మ‌తి చిత్రాన్ని తెలుగులోనే కాక‌ుండా త‌మిళం, మ‌ల‌యాళ భాష‌ల‌లోను డ‌బ్ చేసి విడుద‌ల చేయ‌నున్న‌ట్టు స‌మాచారం. 
 
ఇక ఈ చిత్రాన్ని దీపావళి కానుకగా అక్టోబర్‌లో ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలనుకున్నారు. కానీ కొన్ని కారణాల వల్ల సినిమాని వచ్చే ఏడాదికి వాయిదా వేసినట్లు సమాచారం. విజువల్‌ ఎఫెక్ట్స్‌కి ప్రాధాన్యం ఉన్న కథ కావడంతో సాంకేతికంగా ఉన్నతంగా ఉండేలా చిత్రాన్ని తీర్చిదిద్దుతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

సీఎం స్టాలిన్‌కు షాక్ : నీట్ బిల్లును తిరస్కరించిన రాష్ట్రపతి

కేరళ సీఎంకు షాకిచ్చిన కేంద్రం.. కుమార్తె వీణ వద్ద విచారణకు ఓకే!

'నువ్వు చాలా అందంగా ఉంటావు.. నిన్ను ఎవరైనా ప్రేమిస్తే నేనేం చేయాలి' : యువతి సూసైడ్

జగన్ బాటలో కేటీఆర్.. తెలంగాణలో మేం అధికారంలోకి వస్తే..?

వివేకా కుమార్తె సునీత భద్రతపై ఆందోళన వ్యక్తం చేసిన వైఎస్ షర్మిల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

కిడ్నీలు వైఫల్యానికి కారణాలు ఏమిటి?

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

కిడ్నీ స్టోన్స్ తగ్గించేందుకు సింపుల్ టిప్స్

వారానికి మూడు రోజుల పాటు కొబ్బరి నీళ్లు తాగితే?

తర్వాతి కథనం
Show comments