Webdunia - Bharat's app for daily news and videos

Install App

కిస్సింగ్ సీన్స్‌, ఎక్స్‌పోజింగ్‌కు నో.. సాయిపల్లవి గ్రేట్.. నెటిజన్ల ఫిదా..

మలయాళ ప్రేమమ్ సినిమాలో మల్లర్ పాత్రలో నటించిన సాయిపల్లవి ఫిదా నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఫిదా హిట్ కావడంతో సాయి పల్లవి క్రేజ్ అమాంతం పెరిగిపోతుంది. ఈ అమ్మ‌డి డేట్స్ కోసం నిర్మాత‌లు క్యూ క‌డుతున్న

Webdunia
శుక్రవారం, 18 ఆగస్టు 2017 (10:50 IST)
మలయాళ ప్రేమమ్ సినిమాలో మల్లర్ పాత్రలో నటించిన సాయిపల్లవి ఫిదా నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఫిదా హిట్ కావడంతో సాయి పల్లవి క్రేజ్ అమాంతం పెరిగిపోతుంది. ఈ అమ్మ‌డి డేట్స్ కోసం నిర్మాత‌లు క్యూ క‌డుతున్నారు. ప్ర‌స్తుతం నాని స‌ర‌స‌న ఎంసీఏ.. నాగశౌర్య సరసన మరో చిత్రంలో నటిస్తోంది. 
 
అయితే రీసెంట్‌గా ఒక స్టార్ హీరో సినిమాలో క‌థానాయిక‌గా సాయిపల్లవికి ఆఫర్ వచ్చిందట. అయితే ఆ ఆఫర్‌ను అమ్మడు వదులుకుందట. ఇంతకీ ఆ స్టార్ హీరో ఎవరనే దానిపై ఫిలిమ్ నగర్ వర్గాల్లో చర్చ జరుగుతున్న వేళ.. సాయిపల్లవి గ్లామర్ రోల్స్ గురించి నోరు విప్పింది. 
 
గ్లామర్ కోసం ఎక్స్ పోజింగ్ చేయడం తనకు ఇష్టం ఉండదని సాయిపల్లవి స్పష్టం చేసింది. కిస్సింగ్ సీన్స్‌కూ తాను వ్యతిరేకమని స్పష్టం చేసింది. సినిమాల్లో నటించాలనే తన నిర్ణయాన్ని తన తల్లిదండ్రులు గౌరవించారు కాబట్టి.. వాళ్లని ఇబ్బందిపెట్టే పనేదీ చేయదలచుకోలేదని సాయిపల్లవి చెప్పింది. ఇంకా నటనకు ప్రాధాన్యత గల రోల్స్‌ పోషిస్తానని ఆమె తెలిపింది. 
 
కాగా.. సినీ అవకాశాల కోసం గ్లామర్‌గా కనిపించేందుకు ఎంతైనా వెనుకాడని హీరోయిన్ల మధ్య.. వృత్తికి, తల్లిదండ్రులకు గౌరవమిస్తున్న ఫిదా హీరోయిన్ గ్రేట్ అని నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

Telangana: భర్తను నరికి చంపేసిన ఇద్దరు భార్యలు.. కారణం ఏంటో తెలుసా?

Hyderabad: కల్లు కాంపౌండ్ వద్ద ఆరేళ్ల బాలిక కిడ్నాప్.. సీసీటీవీ కెమెరాలో..? (video)

ప్రేమ వ్యవహారంలో యువతి హత్య - పక్కనే కొన ఊపిరితో ప్రియుడి...

Breaking News: హైదరాబాద్‌లోని సిటీ సివిల్ కోర్టులో బాంబు బెదిరింపు

లింగ నిర్ధారణ పరీక్షలు.. ఆడపిల్ల అని తెలిస్తే చాలు.. అబార్షన్... వైద్యుడి నిర్వాకం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆ మొక్క ఆకులో నానో బంగారు కణాలు!!

నేరేడు పళ్ల సీజన్... నేరేడు ప్రయోజనాలెన్నో!

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments