హీరో శర్వా తన మేడిన్ పాన్ ఇండియా ప్రాజెక్ట్ #Sharwa38ని ప్రారంభించడానికి సిద్ధంగా వున్నారు. ఈ చిత్రానికి విజనరీ డైరెక్టర్ సంపత్ నంది దర్శకత్వం వహిస్తున్నారు. ఈ కొలాబరేషన్ శర్వా, దర్శకుడు సంపత్ నంది ఇద్దరికీ ఒక ముఖ్యమైన మైల్ స్టోన్ ని చూస్తోంది. ఈ గ్రిప్పింగ్, హై-వోల్టేజ్ యాక్షన్ డ్రామాను శ్రీ సత్యసాయి ఆర్ట్స్ బ్యానర్‌పై కెకె రాధామోహన్ నిర్మిస్తారు. లక్ష్మీ రాధామోహన్ సమర్పిస్తారు. ఈ చిత్రం హైబడ్జెట్, అత్యున్నత సాంకేతిక ప్రమాణాలతో ప్రతిష్టాత్మకంగా నిర్మించబడుతుంది. ప్రీ-ప్రొడక్షన్ విషయంలో కూడా టీం చాలా జాగ్రత్తలు తీసుకుంది.
ఈ చిత్రంలో వెరీ ట్యాలెంటెడ్ అనుపమ పరమేశ్వరన్ శర్వా సరసన హీరోయిన్‌గా నటించడానికి ప్రాజెక్ట్ లోకి వచ్చారు. పవర్ ఫుల్ స్క్రీన్ ప్రెజెన్స్‌కు పేరుగాంచిన అనుపమ చేరిక సినిమా కథనానికి డెప్త్ జోడిస్తుంది. కథలో అనుపమ పాత్ర చాలా కీలకంగా వుండబోతోంది. అనౌన్స్ మెంట్ పోస్టర్ అనుపమన రగ్గడ్ ఇంటెన్స్ అవతార్‌లో 1960ల నాటి సినిమా వరల్డ్ కి సరిపోయేలా దుస్తులు ధరించి కనిపించారు. పోస్టర్ ఆమె పాత్ర కథాంశానికి తీసుకువచ్చే బలం, సంక్లిష్టత గురించి తెలిజేస్తోంది.
1960ల చివరలో ఉత్తర తెలంగాణ-మహారాష్ట్ర సరిహద్దులో సెట్ చేయబడిన #Sharwa38 ప్రేక్షకులను మరపురాని అనుభూతిని అందించబోతోంది. ఈ చిత్రం హై-స్టేక్స్ పీరియడ్ యాక్షన్ డ్రామాగా ఉండబోతోంది.
ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ త్వరలో ప్రారంభం కానుంది. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.