Webdunia - Bharat's app for daily news and videos

Install App

రౌడీ అల్లుడుకి మరో వెర్షన్ లా ధమాకా : రచయిత ప్రసన్న కుమార్ బెజవాడ

Webdunia
శనివారం, 10 డిశెంబరు 2022 (16:05 IST)
Prasanna Kumar Bejawada
మాస్ మహారాజా రవితేజ, కమర్షియల్ మేకర్ త్రినాథరావు నక్కిన మాస్ అండ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ 'ధమాకా'. రవితేజ సరసన టాలీవుడ్ ఫేవరేట్ హీరోయిన్  శ్రీలీల హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రాన్ని టిజి విశ్వ ప్రసాద్ భారీగా నిర్మిస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ & అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ పతాకాలపై రూపొందుతున్న ఈ చిత్రానికి వివేక్ కూచిభొట్ల సహ నిర్మాత. ఇప్పటికే విడుదలైన ధమాకా పాటలు, టీజర్ అద్భుతమైన రెస్పాన్స్ తో సినిమాపై భారీ అంచనాలు పెంచాయి. డిసెంబర్ 23న 'ధమాకా' ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లో విడుదలౌతున్న నేపధ్యంలో ఈ చిత్రానికి కథ, స్క్రీన్‌ప్లే, సంభాషణలు అందించిన ప్రసన్న కుమార్ బెజవాడ విలేఖరుల సమవేశంలో చిత్ర విశేషాలని పంచుకున్నారు.
 
'ధమాకా' జర్నీ ఎలా మొదలైయింది ?
 వివేక్ గారు నేను కలసి ఒక సినిమా చేయాలని అనుకున్నాం. మొదట వాళ్లకి సైన్ చేశాను. అదే సమయంలో రవితేజ గారు నా వర్క్ నచ్చి అభినందించాలని పిలిచారు. తర్వాత చాలా రోజులు సరదాగా మాట్లాడుకున్నాం. నేను ఏదీ ఆశించలేదు. కొన్ని రోజుల జర్నీ తర్వాత ..'ఏదైనా వుంటే చెప్పు.. మనం చేద్దాం' అని రవితేజ గారు అన్నారు.  దీంతో వర్క్ చేయడం స్టార్ట్ చేశాం. మొదట ఒక ప్రాజెక్ట్ అనుకున్నాం. అయితే వేరే కారణాలు వలన అది కురలేదు. తర్వాత ధమాకా కథ చెప్పాను. ఫస్ట్ సిట్టింగ్ లోనే రవితేజ గారికి నచ్చేసింది. వెంటనే చేసేద్దామని చెప్పారు. లాక్ డౌన్ కి ముందు ఈ కథ చెప్పాను. లాక్ డౌన్ లో స్క్రిప్ట్ వర్క్ అంతా కంప్లీట్ చేశాం.
 
రవితేజ గారిని ద్రుష్టిలో పెట్టుకొని ఈ కథ రాసుకున్నారా ? 
రవితేజ గారిని ద్రుష్టిపెట్టుకొని ఆయన కోసమే రాసుకున్న కథ ఇది. ఆయన నుండి వరుసగా సీరియస్ సినిమాలు వస్తున్నాయి. రవితేజ గారి బలం ఎంటర్ టైన్ మెంట్. మా బలం కూడా అదే.  ఇద్దరం కలసి మంచి ఎంటర్ టైనర్ చేయాలని ధమాకా చేశాం.
 
డబుల్ ఇంపాక్ట్ అంటే డ్యుయల్ రోల్ నా ?
అవును. ఒక రిచ్ క్యారెక్టర్, ఒక పూర్ క్యారెక్టర్ వుంటుంది. ఒక ఇన్సిడెంట్ రెండు డిఫరెంట్ క్యారెక్టర్లు ఎలా చూస్తారనేదానిపై భేస్ అయిన సినిమా.  రౌడీ అల్లుడికి మరో వెర్షన్ అనుకుంటున్నాను.
 
దర్శకుడు త్రినాథరావు నక్కిన తోనే ఎక్కువ సినిమాలు చేశారు ? ఆయనతో మీ బాండింగ్ ఎలా వుంటుంది ?
నేను ఒక సీన్ చెబితే దాని అవుట్ పుట్ ఎలా వుంటుందో ఆయన కి తెలిసిపోతుంది. ఒక సీన్ చెప్పినప్పుడు అందులో డైలాగ్ రాసిన తర్వాత బావుంటుందని చెబితే.. నాపై నమ్మకంతో వదిలేస్తారు. బయట ఈ కంఫర్ట్ ఉండకపోవచ్చు. మా ఇద్దరికి మంచి సింక్ కుదిరింది.
 
రవితేజ గారికి స్క్రిప్ట్ చేస్తున్నపుడు మీకు ఎదురైన సవాళ్ళు ఏంటి ?
నిజం చెప్పాలంటే నేను పెద్ద కష్టపడలేదు. నా లోపలే ఒక చిన్న రవితేజ ఉన్నాడని నా ఫీలింగ్. నా గత సినిమాలు చూసినా అందులో హీరో పాత్రలలో రవితేజ గారి ప్రభావం వుంటుంది. తెలియకుండానే ఆయన ఇంపాక్ట్ నాలో వుంది. అందుకే పెద్దగా కష్టపడ్డానని అనుకోను.
 
టాలీవుడ్ లో హయ్యెస్ట్ పెయిడ్ రైటర్ మీరే అని చెబుతుంటారు ?
వినడానికి బావుంది (నవ్వుతూ). నేను ఏదీ దాచను. నేను పేపర్లు ఇచ్చి వెళ్ళిపోయే రైటర్ ని కాదు. సినిమా ప్రాసస్ ని ఎంజాయ్ చేస్తాను. సినిమా సెట్ లో వుంటాను. ప్రతి దశలో అందుబాటులో వుంటాను. నేను పెట్టిన ఎఫర్ట్ కి తగ్గట్టె, ఇవ్వాల్సిందే ఇస్తారు.
 
కథ రాయడం ఎక్కువ ఎంజాయ్ చేస్తారా ? మాటలని ఎక్కువ ఎంజాయ్ చేస్తారా ?
మాటలు సీన్స్ ప్రకారమే వస్తాయి. కథ చెప్పినపుడే యనభై శాతం మాటలు వచ్చేస్తాయి. కీ డైలాగ్స్ కి కొంచెం సమయం తీసుకొని రాస్తాను.
 
ధమాకాకి రీషూట్లు చేశారా ?
లేదు. సినిమా అంతా చూసుకున్న తర్వాత ఎంటర్ టైన్ మెంట్ అద్భుతంగా వుంది. రవితేజ గారి మాస్ ఇమేజ్ తగ్గ హీరో పాత్రలో ఎగ్రషన్ తగ్గిందనిపించింది. దానికి మ్యాచ్ చేయడానికి మరో ఫైట్ ని షూట్ చేశాం. ఇది సినిమాని బెటర్ చేయడానికి చేసింది తప్పితే రీషూట్ కాదు.
 
ధమాకా యాక్షన్ కామెడీ అన్నారు కదా..  కామెడీ ఎలా వుంటుంది ?
ఇందులో రావు రమేష్ గారు హైపర్ ఆది కాంబినేషన్ అవుట్ స్టాండింగ్ గా వుంటుంది. వాళ్ళు కనిపిస్తే చాలు నవ్వుతారు. కొంతమందికి సినిమా చూపించాం. చూసిన వారంతా అవుట్ స్టాండింగ్ అంటున్నారు. అలీ గారి పాత్ర కూడా బావుటుంది. మచ్చ రవి గారు, సత్యం రాజేష్ గారి ఎపిసోడ్లు  కూడా బావుంటాయి. హీరో హీరోయిన్ మధ్య సీక్వెన్స్ లు, ఆఫీస్ సీన్స్ హిలేరియస్ గా వుంటాయి. ఇంటర్వెల్ కి ముందు వచ్చే ఐదు నిమిషాల ఎపిసోడ్ సినిమా రేంజ్ ని డిసైడ్ చేసే ఎంటర్ టైన్ మెంట్ సీక్వెన్స్.
 
చిన్న స్థాయి నుండి స్టార్ రైటర్ గా ఎదిగారు ? ఈ జర్నీ ఎలా అనిపిస్తుంది ?
చాలా ఆనందంగా వుంటుంది. బెటర్ లైఫ్ స్టయిల్ వచ్చింది. అమ్మానాన్నలకు బెటర్ లైఫ్ స్టయిల్ ఇవ్వగలుగుతున్నాం. ఇంట్లో వాళ్ళకి కావాల్సింది ఇవ్వగలుగుతున్నాను. వాళ్ళ అవసరాలని తీరుస్తున్నపుడు మనం సక్సెస్ అయ్యామనే ఫీలింగ్ కలుగుతుంటుంది.
 
ధమాకాని హిందీలో కూడా విడుదల చేస్తున్నారు కదా.. ధమాకా పేరుతో అక్కడ ఓ సినిమా వచ్చింది ? దాని ప్రభావం పడుతుందని అనుకుంటున్నారా ?
హిందీలో బిగ్ ధమాకా పేరుతో విడుదల చేస్తున్నాం. పోస్టర్ చూసిన వెంటనే సౌత్ సినిమా అనే సంగతి వాళ్ళకి అర్ధమౌతుంది. అక్కడ ఎంటర్ టైనర్స్ రావట్లేదు. ధమాకా హిందీలో బావుంటుంది. రవితేజ గారికి హిందీలో మార్కెట్ బావుంటుంది. అక్కడ కూడా ధమకా హిట్ కొడితే హ్యాపీ.
 
కొత్త సినిమాల గురించి ?
నాగార్జున గారి కోసం ఒక స్క్రిప్ట్ చేస్తున్నాను. ఇది రీమేక్ అని వార్తలు వచ్చాయి. అది అవాస్తవం. నా సొంత కథే. విశ్వక్ సేన్ చేస్తున్న దాస్ కా ధమ్కి షూటింగ్ పూర్తి చేసుకుంది. మరో చిన్న సినిమా కూడా చేస్తున్నా.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

భారత్‌కు పన్నుపోటు తప్పదు : హెచ్చరించిన డోనాల్డ్ ట్రంప్

భారతీయులకు అమెరికా శుభవార్త.. ఆ వీసాలో మార్పులు

పాదగయ క్షేత్రం ప్రసాదంలో పురుగులు.. పవన్ కల్యాణ్ ఇలాకాలో ఇలానా? (video)

Allu Arjun Fans: అల్లు అర్జున్ అభిమానులపై నాలుగు కేసులు - ఎందుకో తెలుసా?

145 కోట్ల జనాభా ఉన్న దేశంలో ఇంకా ఎక్కువ మంది పిల్లలను కనాలని అంటున్నారు ఎందుకు?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

winter drinks శీతాకాలంలో ఆరోగ్యాన్నిచ్చే డ్రింక్స్

గోరింటను చేతులకు, కాళ్లకు పెట్టుకుంటే ఫలితాలు ఏమిటి?

శీతాకాలంలో ఆరోగ్యంగా వుండేందుకు 10 చిట్కాలు

పారాసిట్మాల్ మాత్రతో తస్మాత్ జాగ్రత్త!!

Ginger Milk in winter: శీతాకాలంలో అల్లం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments